Gopanapalli
-
గచ్చిబౌలిలో దారుణం.. ప్రేమోన్మాది దాడిలో యువతి మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గోపన్‌పల్లి తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్(25) నల్లగండ్లలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. తన స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి తండా సమీపంలో నివాసం ఉంటుంది. ఇక, కర్ణాటకలోని బీదర్‌కు చెందిన రాకేష్ అనే యువకుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే, కొద్దిరోజులుగా రాకేష్.. దీపన వెంటపడుతూ తనను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకోవాలని వేధింపులకు గురిచేశాడు. రాకేష్ ప్రపోజల్‌ను ఆమె నిరాకరించడంతో దీపనపై కోపం పెంచుకున్నాడు.ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్.. ఆవేశంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. అక్కడే ఉన్న దీపన స్నేహితులు.. రాకేష్‌ను అడ్డుకోబోతుండగా వారిపైనా దాడికి పాల్పడ్డాడు. రాకేష్ దాడిలో దీపన మృతిచెందగా.. ముగ్గురు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత రాకేష్ అక్కడి నుంచి పారిపోయాడు. మొయినాబాద్ సమీపంలో విద్యుత్ స్థంభం ఎక్కి కరెంట్ తీగలు పట్టుకుని రాకేష్ ఆత్మహత్యకు పాల్పడగా.. స్థానికులు గుర్తించి అతడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కసు నమోదు చేసుకున్న పోలసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
గోపనపల్లిలో ప్రణీత్ ప్రాజెక్ట్!
6.5 ఎకరాల్లో ఈడెన్ లగ్జరీ విల్లాల నిర్మాణం నేటి నుంచి పీపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం {పణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ సాక్షి, హైదరాబాద్: నిర్మాణంలో నాణ్యత.. గడువులోగా ఫ్లాట్ల అప్పగింత.. అందుబాటు ధరల్లో అభివృద్ధి చెందిన ప్రాంతంలో ప్రాజెక్ట్‌లు.. ఇదీ క్లుప్లంగా చెప్పాలంటే ప్రణీత్ గ్రూప్ విజయ రహస్యం! అందుకే ఎనిమిదేళ్లలో బా చుపల్లి, మల్లంపేట, బీరంగూడలో 14 ప్రాజెక్ట్‌ల్లో.. 2,000లకు పైగా కుటుం బాలకు సొంతింటి కలను సాకారం చేయగలిగామని ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ చెప్పారు. ఇప్పుడిదే లక్ష్యంతో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు చేరువలో గోపనపల్లిలో మెగా ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నామని ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు. ప్రాజెక్ట్ వివరాలివే.. ళీ అభివృద్ధి చెందిన ప్రాంతంలో కుటుంబంతో కలిసి ఆనందంగా, ఆరోగ్యంగానూ జీవించేందుకు గోపనపల్లిలో 6.5 ఎకరాల్లో ఈడెన్ లగ్జరీ వి ల్లా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. వచ్చే మార్చిలో ప్రారంభించనున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 60 విల్లాలొస్తాయి. ధర రూ.1.8- 3 కోట్ల మధ్య ఉంటాయి. ళీబాచుపల్లిలోని ఇంద్రానగర్‌లో 50 ఎకరాల్లో ఆంటిలియా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 120-300 గజాల విస్తీర్ణాలుంటే మొత్తం 600 డూప్లె, ట్రిప్లెక్స్ విల్లాలుంటాయి. ధర రూ.60 లక్షల నుంచి రూ.1.50 లక్షల మధ్య ఉన్నాయి. 2016 ఆగస్టు నుంచి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం. ఇదే ప్రాంతంలో 5 ఎకరాల్లో జెనిత్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 850-1,300 విస్తీర్ణాలుండే మొత్తం 300 లగ్జరీ ఫ్లాట్లుంటాయి. ధర రూ.26 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య ఉన్నాయి. 2017 మార్చి నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. బీరంగూడలో 22 ఎకరాల్లో పనోరమ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 140 నుంచి 300 గజాల విస్తీర్ణాలుండే 370 విల్లాలొస్తాయి. ధర రూ.40 - 80 లక్షల మధ్య ఉన్నాయి. 2016 చివరి నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. మల్లంపేటలో 8 ఎకరాల్లో జెమ్స్ విల్లా ప్రాజెక్ట్ రానుంది. ఇందులో 120 విల్లాలుంటాయి. ధర రూ.40 లక్షల నుంచి ప్రారంభం. 2016 సెప్టెంబర్ నాటికి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. నేటి నుంచే పీపీల్ లీగ్.. ఇప్పటివరకు సంస్థ నిర్మించిన అన్ని ప్రాజెక్ట్‌ల కస్టమర్లను ఒకే వేదిక మీదికి చేర్చి ప్రణీత్ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్)ను నిర్వహించనుంది. మొత్తం 14 ప్రాజెక్ట్‌ల నుంచి 8 టీంలను ఎంపిక చేశారు. మేవ్రాక్స్, వికింగ్స్, గ్లాడియేటర్స్, హ ర్రికేన్స్, అవెంజర్స్, కమాండోస్, పాంతర్స్, బ్లాస్టర్స్ పేర్లతో టీంలు రంగంలోకి దిగనున్నాయి. బాచుపల్లిలోని ఆంటిలి యా మైదానంలో శనివారం తొలి మ్యాచ్ జరగనుంది. ఫైనల్ 19న జరుగుతుంది. విన్నర్‌కు రూ.లక్ష, రన్నర్‌కు రూ.50 వేలు బహుమతిగా అందిస్తారు. -
ఏపీ ఎన్జీవో భూములపై హైకోర్టు స్టేటస్కో
హైదరాబాద్: ఏపీ ఎన్జీవో భూములపై హైకోర్టు స్టేటస్కో విధించింది. విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి సర్వే నెంబర్ 36, 37లలోని 189 ఎకరాలను 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏపి ఎన్జీఓ సోసైటీకి కేటాయించింది. అయితే అప్పటి నుంచి ఇక్కడ నిర్మాణాలు ఏమీ జరగలేదు. ఆ కారణం చూపుతూ ఆ భూమి స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో సురేష్ ఒడ్డార్, శేరిలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్లో ప్రభుత్వ భూములు అని బోర్డు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా, ఈ భూములకు సంబంధించి సుప్రీం కోర్టులో కేసులు ఉన్నందునే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఏపీ ఏన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడరాదని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీఎన్జీవోల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూములపై హైకోర్టు స్టేటస్కో విధించింది.