Mania
-
పుష్ప రాజ్ మేనియా.. టీచర్‌కి షాక్!
సాక్షి, మహబూబాబాద్ జిల్లా: ఎక్కడ చూసిన "పుష్ప" మేనియా ఊపేస్తోంది. థియేటర్ల దగ్గర జనం బారులు తీరుతున్నారు. ఇక స్కూళ్లలోనూ కూడా ‘పుష్ప’ హవా నడుస్తోంది.. అందులో ఒక స్కూల్లో అయితే, ఒక విద్యార్థి రాసిన లీవ్ లెటర్ వైరల్‌గా మారింది. ఎందుకో తెలుసా...?. ఆ స్టూడెంట్‌కి "పుష్ప: ది రూల్" సినిమా అంటే పిచ్చి! అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా! సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని "తపన" పట్టుకుంది. కానీ స్కూల్ కి వెళ్ళాలి! ఏం చేయాలి? ఆలోచించి ఆలోచించి, ఒక "ధైర్యమైన" నిర్ణయం తీసుకున్నాడు. మాష్టారు గారికి ఒక లెటర్ రాశాడు.అందులో ఏముందో తెలుసా..?.. "సార్, నేను పుష్ప సినిమాకు వెళ్తున్నాను. ఎందుకంటే ఆ హీరో నా ఫేవరెట్. దయచేసి నాకు లీవ్ ఇవ్వండి." అంతే! నిజాయితీగా లీవు అడిగేశాడు. లెటర్ చదివిన టీచర్ కి మొదట షాక్..! తర్వాత ఆనందం! "ఇంత నిజాయితీగా లీవు అడిగే విద్యార్థిని ఇంతవరకు చూడలేదు" అనుకున్నారు. తన శిష్యుడు నిజం చెప్పాడు అని గర్వంగా ఫీల్ అయి..,ఏం చేశారంటే, ఆ లెటర్ ని ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ లో పెట్టేశారు!. "పుష్ప" సినిమా కన్నా ఆ లెటర్ వైరల్ అయిపోయింది.ఇదీ చదవండి: బన్నీ నట విశ్వరూపం.. ‘పుష్ప 2’ హిట్టా? ఫట్టా? -
Hyderabad: మ్యాక్స్ మాన్యా ప్రారంభం..
నగర ఫ్యాషన్ ఔత్సాహికులను అలరించేందుకు మ్యాక్స్ ఫ్యాషన్ ఆధ్వర్యంలో ‘మాన్యా సెల్’ ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. అధునాతన ఫ్యాషన్‌కు వేదికైన నగరంతో పాటు దేశవ్యాప్తంగా మ్యాక్స్ ఫ్యాషన్ ప్రియులకు నేటి నుంచి ఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ష్యాషన్ రంగంలో ఇప్పటి వరకూ ఎక్కడా లేని విధంగా రూ.399 లోపే స్పెషల్ మాన్యా సెల్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. -
17 రాష్ట్రాల్లో కాషాయ దళం.. దూసుకుపోతున్న మోదీ మ్యాజిక్!
దేశంలో జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయభేరీ మోగించింది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 164 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో రాజస్థాన్ తన చరిత్రను పునరావృతం చేసి, అధికారాన్ని మార్చుకుంది. ఇక్కడ బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ అంటే 90 సీట్లలో 54 గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాలు లోక్‌సభ ఎన్నికలకు కీలకమైనవి. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో 65 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు ఈ రాష్ట్రాలు చాలా కీలకమైనవి. ఈ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించాక 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండగా కొన్నింటిలో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉంది. కాగా మహారాష్ట్ర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, పుదుచ్చేరిలలో మిత్రపక్షాలతో చేయికలిపింది. దేశ రాజకీయ మ్యాప్‌ను పరిశీలిస్తే ప్రస్తుతం దేశంలోని 57 శాతానికి పైగా ప్రాంతంలో బీజేపీ అధికారంలో ఉంది. 2017 సంవత్సరంలో దేశంలోని 78 శాతం ప్రాంతంలో బీజేపీ అధికారంలో ఉంది. 2018లో బీజేపీ పలు ఓటములను ఎదుర్కొంది. మొదట కర్ణాటకలో, ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోయింది. 2019 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తాను చాటుకుంది. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల పరంపర కొనసాగింది. 2019 నాటికి బీజేపీ 34శాతం రాజకీయ విస్తీర్ణానికి తగ్గింది. బీజేపీ పాలన కేవలం 44 శాతం జనాభాపై మాత్రమే ఉంది. అయితే ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించడంతో పార్టీ గ్రాఫ్ మరింతగా పెరిగింది. ఈ విజయాలను మోదీ మ్యాజిక్ అని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇది కూడా చదవండి: తగ్గిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య..20కే పరిమితం! -
అటు ఆర్ఆర్ఆర్ ప్రభంజనం, ఇటు చెర్రీ బర్త్‌డే.. హవా మామూలుగా ఉండదుగా!
మెగా పవర్ స్టార్ రాంచరణ్.. ఇపుడు ఈ పేరు వింటే చాలు.. ఫ్యాన్స్‌కు పూనకాలే. ఎందుకంటే చెర్రీ లేటెస్ట్ మూవీ ఆర్ఆర్ఆర్ సంచలనం అలాంటిది మరి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి క్రియేటివిటీకి, మెగా వారసుడు యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందో చాటి చెప్పిన ప్యాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ ప్రభంజనం నేపథ్యంలో మార్చి 27న రాంచరణ్ పుట్టిన రోజు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది. అలాగే గత ఏడాది రాంచరణ్ పుట్టినరోజుకు స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ మరిపుడు రామరాజు బర్త్‌డేకు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తుందా అని కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రాంచరణ్ గురించి పరిచయం అవసరమే లేదు. అలనాటి దివంగత ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, మెగాస్టార్ చిరంజీవిగా కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, హీరోగా తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ‘చిరుత’గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించాడు. ఆ తరువాత పెద్దగా కమర్షియల్ హిట్స్ సాధించలేకపోయినా, నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. 2007లో తొలి మూవీతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిలింఫేర్ అవార్డు, నందీ స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కించుకున్నాడు. ఆ తర్వాత రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన మగధీర సంచలనం సృష్టించింది. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు, నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు చెర్రీ ఖాతాలో చేరాయి. కాలభైరవగా, రొమాంటిక్ హీరోగా చరణ్ ఆడియెన్స్‌లో తనకంటూ స్పెషల్ గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే 2010లో ఆరెంజ్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆరెంజ్ మూవీ పాటలు సక్సెస్ అయినప్పటికీ, కమర్షియల్ కూడా ఘోరంగా ఫెయిల్ అయింది. అయితే చరణ్ నటనకు విమర్శకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక 2011లో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చ, 2013లో వి. వి. వినాయక్ దర్శకత్వంలో నాయక్, పైడిపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఎవడు మూవీ కూడా సో.. సో గానే నడిచాయి. పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ బ్లాక్ బ్లస్టర్ జంజీర్‌కి రీమేక్‌గా, అపూర్వ లాఖియా దర్శకత్వంలో తెరకెక్కిన తుఫాన్ మూవీ కూడా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. 2014లో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరివాడేలే, 2015లో శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రూస్ లీ సినిమాలు ఇదే బాటలో పయనించాయి. ఆశించిన కలెక్షన్లను రాబట్ట లేక పోయాయి. అయితే 2016లో వచ్చిన ధృవ చిత్రం కాస్త ఊరట నిచ్చింది. ఈ విజయానికి కొనసాగింపుగా వచ్చిన రంగస్థలం మూవీ సూపర్ డూపర్ హిట్టయింది. ముఖ్యంగా వికలాంగుడిగా రాంచరణ్ ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. 2018 లో క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చిట్టిబాబుగా నట విశ్వరూపం ప్రదర్శించాడు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కలగలసి టాలీవుడ్ రికార్డులను తిరగరాసిన మూవీ రంగస్థలం. ఈ సినిమా సక్సెస్‌తో రాం చరణ్ ఇమేజ్ భారీగా పెరిగింది. కానీ 2019 జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయ విధేయ రామ మళ్లీ ఫ్లాప్‌నే మూట గట్టుకుంది. అయినా సాలిడ్ హిట్ కోసం ఓపిగ్గా వెయిట్ చేసి చివరికి మరో బ్లాక్ బ్టస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న మూవీ ఆర్ఆర్ఆర్. కోవిడ్ కష్టాలు, దాదాపు రెండేళ్ల కృషి, ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య రాంచరణ్, రాజమౌళి, ఎన్టీఆర్, కాంబినేషన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ హిట్ టాక్‌తో దూసుకు పోతోంది. రామరాజుగా చెర్రీ యాక్షన్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. భారీ వసూళ్లతో ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసేందుకు రడీ అవుతోంది. రాం చరణ్ కేవలం నటుడు మాత్రమే కాదు సక్సెస్ఫుల్ ఆంట్రపెన్యూర్ కూడా. హార్స్ రైడింగ్ అంటే ఇష్టపడే చెర్రీకి 'హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్' తోపాటు ట్రూజెట్ అనే సొంత ఎయిర్‌లైన్స్ కూడా ఉంది. ఇక ఆర్సి భార్య ఉపాసన అపోలో హాస్పిటల్స్‌కు సంబంధించి కీలక బాధ్యతల్లో ఉన్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్‌లో బాహుబలి2 మానియా
-
మతోన్మాదం శాంతికి విఘాతం
క్రైస్తవులపై దాడుల నియంత్రణకు చర్యలు చేపట్టాలి అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ డిమాండ్ విజయవాడ (గాంధీనగర్) : మతోన్మాదంతో కొందరు దేశంలోని క్రైస్తవులపై దాడులకు పాల్పడుతున్నారని, దీనివల్ల శాంతి నశిస్తోందని అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) జాతీయ అధ్యక్షులు గేరా హనోక్ అన్నారు. క్రైస్తవులపై దేశ వ్యాప్తంగా జరుగుతున్న దాడులకు నిరసనగా శనివారం జాతీయ స్థాయిలో ‘ క్రైస్తవ సమాఖ్య గర్జన’ను విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 26 ప్రకారం ప్రతిఒక్కరికీ భావప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛ ఉందని చెప్పారు. మతమార్పిడుల పేరుతో ఫాదర్లు, పాస్టర్లు, బిషప్‌లపై భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. మతతత్వదాడులను తిప్పికొట్టేందుకు ప్రతి క్రైస్తవుడు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ముస్లిం ఇమాంలకు, హిందూ పూజార్లకు ఇస్తున్నట్లుగా పాస్టర్లకు కూడా ప్రభుత్వమే గౌరవ వేతనాలు ఇవ్వాలని, అభివృద్ధి పేరుతో కూల్చేస్తున్న క్రైస్తవ చర్చిల పునర్నిర్మాణానికి నష్టపరిహారం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ రాష్ట్ర అధ్యక్షులు అద్దంకి దైవారావు, చిత్తూరు జిల్లా నుంచి పి. జాన్‌ప్రసాద్, నెల్లూరు నుంచి కె. జోసఫ్ మోజెస్, ప్రకాశం జిల్లా నుంచి బిషప్ సంసోన్, గుంటూరు జిల్లా నుంచి వై. శామ్యూల్ జాన్, కృష్ణా జిల్లా నుంచి కె. జోసఫ్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి డాక్టర్ డేవిడ్ లివింగ్‌సన్, తూర్పు గోదావరి జిల్లా నుంచి ఎన్. నోవా, విశాఖపట్నం జిల్లా నుంచి బిషప్ డాక్టర్ జాన్ సమర్పణరాజు, విజయనగరం జిల్లా నుంచి డాక్టర్ ఆర్. జాన్, శ్రీకాకుళం జిల్లా నుంచి డీఎస్‌వీఎస్ కుమార్, దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి క్రైస్తవ మత పెద్దలు, 13 జిల్లాల నుంచి పలువురు పాస్టర్లు, ఫాదర్లు పాల్గొన్నారు. -
హోటల్స్‌లోనూ కబాలి మానియా
-
ఉన్మాదంపై ఎటాక్
అరోరా కాలేజీలో సోమవారం చోటుచేసుకున్న ప్రేమోన్మాది దురాగతం పై విద్యార్థి లోకం ఆగ్రహావేశాలను వ్యక్తం చేసింది. మరోసారి ఇలాంటి దారుణాలు చోటుచేసుకోకుండా ప్రభుత్వం అమ్మాయిల రక్షణ కోసం గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరింది. ప్రేమోన్మాదులపై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చింది. బండ్లగూడలోని అరోరా సైంటిఫిక్, టెక్నలాజికల్ అండ్ రీసెర్చ్ అకాడమీలో విద్యార్థిని రవళిపై ప్రేమ పేరుతో గుంటూరుకు చెందిన యువకుడు కత్తితో దాడికి పాల్పడి, ఆ తరువాత విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం కళాశాలలో తీవ్ర కలకలం రేపింది. దాడి జరుగుతున్న సమయంలో కొందరు విద్యార్థులు అడ్డుకొని రవళిని కాపాడిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్న సంకల్పంతో ‘సాక్షి’ మంగళవారం కళాశాలలో చర్చావేదికను నిర్వహించింది. కళాశాల డెరైక్టర్ చేపూరి శ్రీలత ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. మరోసారి ఇలాంటి దారుణాలు జరగకుండా తల్లిదండ్రులు, ప్రభుత్వాలు కలసి కట్టుగా కృషి చేయాలని విద్యార్థులు ముక్తకంఠంతో అభిప్రాయపడ్డారు. దాడి సమయంలో ప్రత్యక్షంగా అక్కడ ఉన్న కొందరు విద్యార్థులతో పాటు, అధ్యాపకుల అభిప్రాయాలు. - కర్నాటి శ్రీనివాస్ పోలీసుల వైఫల్యమే.. రవళిని ప్రదీప్ రెండు మూడేళ్ల నుంచి వేధిస్తున్నప్పుడు తల్లిదండ్రులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రదీప్‌పై రెండు కేసులు సైతం నమోదయ్యాయి. నిర్భయ చట్టం కింద కేసు నమోదైనా అతడు ఎలా బయట తిరిగాడు. పోలీసులు సరిగ్గా వ్యవహరిస్తే ఈ ఘటన జరిగేది కాదు. ఈ సంఘటనలో విషం తాగిన ప్రదీప్‌ను కూడా తాము మానవతా దృక్పథంతో ఆస్పత్రిలో చేర్పించాం. పిల్లల నడతకు బాధ్యత తల్లిదండ్రులదే. తాము ఎంత చెప్పినా ఫలితం లేకుండా పోయిందనే సమాధానమే ప్రదీప్ తల్లిదండ్రుల నుంచి వచ్చింది. పిల్లలు చిన్నప్పటి నుంచే తప్పటడుగులు వేయకుండా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. - చేపూరి శ్రీలత, డెరైక్టర్, అరోరా కళాశాల. షాక్‌కు గురయ్యాం. ఉదయాన్నే కాలేజీలో అడుగు పెట్టిన కొద్ది సేపటికే రవళిపై దాడి జరిగింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చూసి షాక్‌కు గురయ్యా. ఈ సంఘటనతో తల్లిదండ్రుల్లో సైతం భయాందోళనలు అలుముకున్నాయి. - ప్రజ్ఞ, ఈసీఈ నాలుగో సంవత్సరం అడ్డుకున్నాం.. అప్పటికే రవళి తలపై ప్రదీప్ కత్తితో రెండు సార్లు దాడి చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న రవళిపై మరోసారి దాడి చేయడానికి యత్నిస్తుండగా మా ల్యాబ్ ఇన్చార్జి ప్రవీణ్ అడ్డుకున్నారు. అతన్ని బలంగా హెల్మెట్‌తో కొట్టాడు. ఇద్దరూ పెనుగులాడుకున్నారు. ప్రదీప్‌ను పట్టుకుందామనుకునే లోపే విషం తాగాడు. గతంలో కూడా రవళిపై రెండుసార్లు దాడికి పాల్పడిన ప్రదీప్‌ను పోలీసులు కఠినంగా శిక్షించకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది. - శ్రవణ్ కుమార్, ఈఈఈ 4వ సంవత్సరం. పక్కనే ఉన్నాను.. రవళిపై దాడి చేసిన సమయంలో ఆమె పక్కనే ఉన్నాను. భయంతో వణికిపోయాను. నా వెనుక నుంచి వచ్చిన ప్రదీప్ బ్యాగ్‌లో నుంచి కత్తి తీసి ఒక్కసారిగా దాడికి దిగాడు. అధ్యాపకులు, ఇతర విద్యార్థులు ప్రదీప్‌ను అడ్డుకోవడంలో ఏ మాత్రం ఆలస్యమైనా రవళిని చంపేసేవాడు. - లక్ష్మీ, సీఎస్ఈ 3వ సంవత్సరం. ప్రేమ పేరుతో అఘాయిత్యాలా..! అమ్మాయిల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రేమిస్తున్నానంటూ వేధింపులకు గురిచేయడం సరికాదు. ఇలాంటి వారికి తల్లిదండ్రులతో పాటు పోలీసులు కూడా కౌన్సెలింగ్ చేయాలి. ప్రదీప్ విషయంలో పోలీసులు సరిగ్గా వ్యవహరించి ఉంటే రవళిపై దాడి జరిగేది కాదు. - మౌనిక, సీఎస్ఈ 4వ సంవత్సరం. స్వేచ్ఛ పేరుతో.. 15 ఏళ్లు దాటగానే యువత స్వేచ్ఛ పేరుతో తల్లిదండ్రుల నియంత్రణలో నుంచి బయటికి వస్తున్నారు. కానీ తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా ఉండాలి. ఇలాంటి చనువు ఉంటేనే తమ విషయాలన్నింటిని పేరెంట్స్‌తో షేర్ చేసుకోగలుగుతారు. మా పిల్లాడు ఎదిగాడని వదిలేస్తే ఇలాంటివే జరుగుతాయి. - సృజన్ రెడ్డి, అధ్యాపకుడు, ఈసీఈ విభాగం. శిక్షలు కఠినంగా ఉండాలి.. ఇలాంటి సంఘటనలపై ప్రభుత్వం సరిగా స్పందించడం లేదు. అరెస్టయిన వారు కూడా బెయిల్‌పై ఈజీగా బయటకు వచ్చేస్తున్నారు. శిక్షలు కఠినంగా ఉండాలి.. వాటిని వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. మానవ సంబంధాలు, విలువలపై పాఠశాల స్థాయి నుంచే బోధన జరిగేలా చూడాలి. - మనీష్, ఈసీఈ 4వ సంవత్సరం. ఎలా దాడి చేయాలో చూపిస్తున్నారు.. అమ్మాయిలను బయటకు పంపాలంటేనే తలిదండ్రులు భయపడుతున్నారు. ప్రతి అమ్మాయిలో అమ్మను చూసుకోవాలి. అమ్మకిచ్చిన మర్యాదను ఇతరులకు ఇవ్వాలి. టీవీల ప్రభావం కూడా నేటి తరంపై అధికంగా ఉంటుంది. ఎలా దాడులు చేయాలో షూట్ చేసి మరీ చూపిస్తున్నారు. - రక్షిత, ఈఈఈ 4వ సంవత్సరం. కరాటే నేర్చుకోవాలి.. ప్రస్తుత సమాజంలో మహిళలు కరాటే వంటి ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవాలి. అప్పుడే మగాళ్ల దాడుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. మహిళలపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకునే దిశగా సమాజం అంతా కదలిరావాలి. - భార్గవి, ఈఈఈ 3వ సంవత్సరం. -
సాకర్ మానియాకూ బోలెడు ఆప్‌లు...
భలే ఆప్స్ సాకర్ మానియా ఆరంభమైంది. బ్రెజిల్లో రొనాల్డో, మెస్సీల చమత్కారాలు, స్కోరు వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే బోలెడు అప్లికేషన్లు మీ కోసం అందుబాటులో ఉన్నాయి. స్కోర్లతోపాటు మ్యాచ్‌లు, క్రీడాకారులకు సంబంధించిన లోతైన విశ్లేషణలు అందించేందుకు ఈఎస్పీఎన్ ఒక అప్లికేషన్‌ను సిద్ధం చేసింది. మీకు ఇష్టమైన జట్టును ఎంచుకుని వాటి వివరాలను అలర్ట్‌ల రూపంలో పొందవచ్చు. ఇక ప్రపంచకప్ ఫుట్‌బాల్ పోటీని నిర్వహిస్తున్న ఫీఫా కూడా ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా వివరాలు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవేకాకుండా ఫీఫా 14, వన్ఫుట్బాల్బ్రెజిల్, ట్రావెల్ పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఎడిషన్, ద స్కోర్ పేర్లతో కూడా అనేక ఆండ్రాయిడ్ అప్లికేషన్లు సాకర్ సంబరాన్ని మీ చేతుల్లోకి తెస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం... ఎంజాయ్ ‘ద బ్యూటిఫుల్ గేమ్’!