మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
సాక్షి, నారాయణఖేడ్: ప్రమాదశాత్తు పురాతన బావిలో అగ్నిప్రమాదం సంభవించగా అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పి ప్రమాదాన్ని నివారించారు. ఈ ప్రమాదం పట్ల పట్టణవాసులు ఆందోళనకు గురయ్యారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన హనుమాన్ కాలనీలోని హనుమాన్ ఆలయం వద్ద పురాతన బావి ఉంది.
చాలా కాలంగా బావిని ఉపయోగించకపోడంతో చెత్తా, చెదారం వేస్తుండడంతో బావిలో చెత్త నిండిపోయింది. గురువారం మధ్యాహ్నం బావిలో ఎవరూ మంటలు అంటించారో తెలీదు కానీ ఒక్కమారుగా మంటలు అంటుకున్నాయి. ఈ బావి పక్కనే ఓ ప్రధాన బ్యాంకు, హనుమాన్ ఆలయం, మరో వైపు పెట్రోల్‌బంక్, చుట్టూ నివాసగృహాలు ఉన్నాయి. ప్రమాదం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని స్థానికులు అగ్నిమాపకకేంద్రం అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మంటలను ఆర్పివేశారు. సకాలంలో మంటలను ఆర్పివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment