మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి పి.సంజీవరెడ్డికి గురువారం పోలీసులు షోకాజ్ నోటీసును జారీచేశారు.
నారాయణఖేడ్: మెదక్ జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి పి.సంజీవరెడ్డికి గురువారం పోలీసులు షోకాజ్ నోటీసును జారీచేశారు. ఈ నెల 22వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థి పేరిట ముద్రించిన కరపత్రాలను వివిధ దినపత్రికల ద్వారా పంపిణీ చేశారు. వీటిపై ప్రింటర్ పేరు, ఎన్ని కరపత్రాలు ముద్రించారో వివరాలు లేనందున అభ్యర్థికి షోకాజ్ నోటీసును జారీ చేసినట్టు పోలీసులు తెలిపారు.
మూడు నామినేషన్ల ఉపసంహరణ
నారాయణఖేడ్ ఉప ఎన్నికలో దాఖలైన నామినేషన్లలో మూడు నామినేషన్లను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వాసం వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం నామినేషన్ల పరిశీలనలో టీడీపీ తరఫున డమ్మీగా నామినేషన్ వేసిన మారుతిరెడ్డి నామినేషన్‌ను తిరస్కరించారు. పార్టీ అసలు అభ్యర్థి నామినేషన్ స్వీకరించినందున ఈ నామినేషన్ తిరస్కరణకు గురైంది. స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన వి.తుకారాం నాయక్, సుంకరి లింగయ్య నామినేషన్లను తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి చెప్పారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 30 చివరి తేదీ.