నారాయణఖేడ్: మున్సిపోల్స్ ప్రచారానికి కాంగ్రెస్ క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల ప్రచారం ఆశ్చర్య పరుస్తుంది. నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కోసం కాంగ్రెస్ ‘మున్సిపల్ కాంగ్రెస్ ఎన్‌కేడీ’అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. ఈ గ్రూప్‌నకు ‘ఇన్వైట్ లింక్’ ఇవ్వడంతో టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తలు, నేతలు సైతం యాడ్ అయ్యారు. ఆపై తమ పార్టీకి ఓటేయాలనే ప్రచార చిత్రాలను పోస్ట్ చేశారు. టీఆర్‌ఎస్‌కు ఓటేయాలని వీడియోలు, టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి బీఫారాలు ఇచ్చే ఫొటోలు, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఫొటోలు పోస్ట్ చేశారు. అలాగే బీజేపీకి ఓటేయాలంటూ ఆ పార్టీ అభిమాని సైతం వీడియోను పోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment