నేడు నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్ | Today, Narayankhed by poll counting | Sakshi

నేడు నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక కౌంటింగ్

Feb 16 2016 12:14 AM | Updated on Aug 15 2018 7:35 PM

నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.

నారాయణఖేడ్ (మెదక్ జిల్లా): నారాయణఖేడ్ అసెంబ్లీ ఉప ఎన్నిక కౌంటింగ్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. నారాయణఖేడ్ మండలం జూకల్ శివారులోని పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు తెలిపారు.

కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత రెండు, మూడు గంటల్లోనే ఫలితం వెల్లడవుతుందన్నారు. కౌంటింగ్‌కు 14 టేబుళ్లను ఏర్పాటు చేశామని, మొత్తం 21 రౌండ్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. దీనికి 137 మంది ఉద్యోగులను నియమించినట్లు పేర్కొన్నారు. ప్రతీ టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లు, ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించామన్నారు. ఫలితాల సమాచారం ఎప్పటికప్పుడు మీడియాకు అందించేందుకు కౌంటింగ్ కేంద్రంలో మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి భద్రత ఏర్పాటు చేశామని వెంకటేశ్వర్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement