మెదక్ : మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉప ఎన్నికకు బుధవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ ఉప ఎన్నికకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఫిబ్రవరి 13న జరగనుంది. 16వ తేదీన ఈ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
నారాయణఖేడ్ తహశీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామని సహాయ ఎన్నికల అధికారి మహమ్మద్ అన్వర్ వెల్లడించారు. నామినేషన్ పత్రాలు కార్యాలయంలో పొందవచ్చు అని ఆయన అభ్యర్థులకు సూచించారు.