మెదక్ : మెదక్ జిల్లా నారాయణ్ఖేడ్ ఉపఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవనున్న సంజీవరెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి పాల్గొనున్నారు.
2014లో జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిష్టారెడ్డి విజయం సాధించారు. ఆయన గతేడాది గుండెపోటుతో మరణించారు. దీంతో నారాయణ్ఖేడ్ నియోజకవర్గం ఉప ఎన్నిక అనివార్యమైంది. నారాయణ్ఖేడ్ ఉప ఎన్నిక ఫిబ్రవరి 13వ తేదీన జరగనుంది. ఓట్ల లెక్కింపు 16వ తేదీన జరుగుతుంది.