'సిద్ధిపేట, నారాయణ్ఖేడ్ నాకు రెండు కళ్లు' | Harish rao election campaigning in narayankhed by elections | Sakshi
Sakshi News home page

'సిద్ధిపేట, నారాయణ్ఖేడ్ నాకు రెండు కళ్లు'

Published Wed, Jan 27 2016 11:32 AM | Last Updated on Wed, Aug 15 2018 7:35 PM

'సిద్ధిపేట, నారాయణ్ఖేడ్ నాకు రెండు కళ్లు' - Sakshi

'సిద్ధిపేట, నారాయణ్ఖేడ్ నాకు రెండు కళ్లు'

సంగారెడ్డి : మెదక్ జిల్లాలోని సిద్ధిపేట, నారాయణ్ఖేడ్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లు అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు తెలిపారు. బుధవారం మెదక్ జిల్లా కల్హేర్ మండలంలోని పలు గ్రామాల్లో హరీష్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా టి.హరీష్రావు మాట్లాడుతూ...  60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ నారాయణ్ఖేడ్ ఏమాత్రం అభివృద్ధి చేయలేదని చెప్పారు.

ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మూడేళ్లలో నారాయణ్ఖేడ్ అభివృద్ధి చేసి చూపిస్తామని హరీష్రావు వెల్లడించారు.  ఈ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఫిబ్రవరి 13న ఈ ఉప ఎన్నిక జరగనుంది. అలాగే 16న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement