నారాయణఖేడ్ : ప్రజాపద్దుల కమిటీ ఛైర్మన్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పి.కిష్టారెడ్డి మృతి చెందడంతో నారాయణఖేడ్‌లో వ్యాపారులు, పాఠశాలల యాజమాన్యాలు రెండురోజులపాటు స్వచ్ఛందంగా మూసివేశారు. ఎమ్మెల్యే మరణించారన్న సమాచారం తెలియడంతో వ్యాపారులు, పాఠశాలల యాజమాన్యాలు మంగళవారం, బుధవారం రెండురోజులు సెలవు ప్రకటించారు.
బుధవారం నారాయణఖేడ్లో ఎలాంటి వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరచుకోలేదు. తమ నేత దూరమవడాన్ని జీర్ణించుకోలేక స్వచ్చందంగా బంద్‌ను నిర్వహించారు. మంగళవారం సంత రోజు అయినా వ్యాపారులు బంద్ పాటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సైతం ఉద్యోగులు కన్పించలేదు. అందరూ కిష్టారెడ్డి భౌతికకాయానికి చూసేందుకు తరలి వెళ్ళారు.