నారాయణఖేడ్ (మెదక్) : 'తెలుగుదేశం పార్టీ మునిగిన నావ, ఆ పార్టీకి ఓట్లేస్తే మురికి కాల్వలో వేసినట్టే..' అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. శుక్రవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ కనుమరుగయిందన్నారు.
ప్రజలు ఆ పార్టీ గురించి మర్చిపోవాలన్నారు. గాయత్రీ షుగర్స్ పరిధిలోని రైతులకు చెరకు బిల్లుల బకాయి రూ.11.30 కోట్లు ఈ నెల 17వ తేదీలోగా చెల్లించన్నుట్లు హరీశ్‌రావు తెలిపారు. ట్రాన్స్‌కో అధికారులు రైతులకు ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు ముడుపులు అడిగితే సస్పెండ్ చేస్తానని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు.
టీడీపీ..మునిగిన నావ : మంత్రి హరీశ్‌రావు
Published Fri, Oct 9 2015 8:04 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM
Advertisement
Advertisement