తరగతి గదిలో కొండచిలువ కలకలం!
నారాయణఖేడ్(మెదక్): ఎక్కడో అడవుల్లో.. జనావాసాలకు దూరంగా కొండకోనల్లో సంచరించాల్సిన కొండచిలువ తరగతి గదిలో ప్రత్యక్షమైంది. కొండచిలువ కనిపించడంతో ఆ పాఠశాలలో కొద్దిసేపు కలకలం రేగింది. వివరాలిలా ఉన్నాయి... మెదక్ జిల్లా నారాయణఖేడ్ నెహ్రూ నగర్‌లోని ప్రభుత్వ స్కూల్లో కొండచిలువ ప్రవేశించింది.
తరగతి గదిలో కొండచిలువ ప్రత్యక్షమవడంతో.. విద్యార్థులు, టీచర్లకు పైప్రాణాలు పైనే పోయాయి. భయాందోళనకు గురైన చిన్నారులు, ఉపాధ్యాయులు పరుగు లంకించుకున్నారు. స్కూలు యాజమాన్యం నుంచి సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుంది. కొండ చిలువను పట్టుకోవడానికి అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.