విద్యార్థిని చితక్కొట్టి, ఆపై చెప్పుతో దాడి | teacher attack on student in nellore distirict | Sakshi
Sakshi News home page

విద్యార్థిని చితక్కొట్టి, ఆపై చెప్పుతో దాడి

Published Wed, Feb 4 2015 12:38 PM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

teacher attack on student in nellore distirict

నెల్లూరు: నోట్ బుక్ బదులు పలకపై రాసినందుకు ఓ ఉపాధ్యాయురాలు.. విద్యార్థినిని వాతలు పడేలా కొట్టింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం వాసిలి ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. నోట్‌బుక్‌లో గాకుండా పలకపై ఎందుకు రాశావంటూ కీర్తి అనే మూడో తరగతి విద్యార్థినిని...ఉపాధ్యాయురాలు పద్మ చితకబాదింది. ఈ విషయమై టీచర్‌కు, విద్యార్థిని తల్లిదండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయంలో తనకు మద్దతు ఇవ్వలేదని స్కూల్ హెడ్ మాస్టర్పై కూడా ఆమె చెప్పుతో దాడి చేసింది. టీచర్ నిర్వాకంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement