
బి.కొత్తకోట: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శనివారం నుంచి విద్యార్థుల హాజరు మారబోతోంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు హాజరు వేసేటప్పుడు విద్యార్థులు ప్రజంట్ సార్, ప్రజంట్ మేడమ్ అని పలుకుతారు. ఇకపై ఈ మాటలు వినబడవు. జిల్లాను మరుగుదొడ్లరహితంగా మార్చే ప్రక్రియ ప్రభుత్వ పాఠశాలలకు చేరింది. విద్యార్థుల ఇళ్లలో మరుగుదొడ్డి కట్టారా లేదా అని తెలుసుకునేం దుకు జిల్లా విద్యాశాఖ అధికారి పాండురంగారావు శని వారం ఓ ఉత్తర్వును జారీ చేశారు.
తరగతి గదిలో హాజరు వేసేటప్పుడు విద్యార్థులు కట్టాము సార్ లేకపోతే లేదు సార్ అనాలి. అంటే విద్యార్థి ఇంటిలో మరుగుదొడ్డి ఉంటే కట్టాము అనాలి, మరుగుదొడ్డి లేకపోతే కట్టలేదు అనాలి. ఇలా ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ వచ్చే మార్చి 31 వరకు ఇదేవిధంగా హాజరు నమోదు సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment