నారాయణఖేడ్ (మెదక్) : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్, టీడీపీల మైండ్ బ్లాక్ అయ్యిందని, రెండు పార్టీలు చిత్తు చిత్తుగా పొట్టు పొట్టుగా అయ్యాయని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. నారాయణఖేడ్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఫలితాలతో ఆయా పార్టీల నాయకులు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
వరంగల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను దెబ్బకొట్టిన ప్రజలు.. రేపు నారాయణఖేడ్‌లోనూ దెబ్బ మీద దెబ్బ కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. హైదరాబాద్‌లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తమకు వద్దని కరివేపాకు మాదిరిగా తీసిపారేశారన్నారు. ఏదో దిష్టి తగలకుండా ఉండేందుకు రెండు సీట్లు ఇచ్చారన్నారు. ఖేడ్‌లో మాత్రం కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు రావన్నారు. హైదరాబాద్‌లో చెల్లని రూపాయి ఖేడ్‌లో చెల్లుతుందా అంటూ మంత్రి ప్రశ్నించారు.
కాంగ్రెస్, టీడీపీలకు మైండ్ బ్లాక్: హరీష్‌రావు
Published Sat, Feb 6 2016 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM
Advertisement