ghmc election results
-
హైదరాబాద్ ఫలితాలతో నూతనోత్తేజం!
సాక్షి ముంబై: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో లభించిన మంచి ఫలితాలతో ఒక్కసారిగా మహారాష్ట్ర బీజేపీలో కూడా నూతన ఉత్తేజం నిండింది. దీంతో రాబోయే బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఎన్నికల్లో కూడా బీజేపీదే పైచేయి అవుతుందన్న ధీమాను ఆ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రామ్ కదం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బిహార్‌లో బీజేపీ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా చర్చల్లోకెక్కిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 4 సీట్లు ఉన్న బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని హైదరాబాద్‌లో పాగా వేసింది. అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్తోపాటు ఎంఐఎంకు గట్టి పోటీ నిచ్చి బీజేపీ తన సత్తాను చాటుకుంది. దీంతో ముంబైతోపాటు మహారాష్ట్ర బీజేపీలో నూతన ఉత్తేజం నిండింది. ఇదే ఉత్తేజాన్ని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వరకు కొనసాగుతుందని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో బీజేపీ తన జెండా ఎగురవేస్తుంది’’ అని రామ్ కదం పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఎంసీలో బీజేపీదే అధికారంలోకి వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు బీఎంసీని కైవసం చేసుకునేందుకు ‘మిషన్ ముంబై’ ప్రారంభించినట్లు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని బీజేపీ కార్యకర్తలు ఇప్పటి నుంచే బీఎంసీ ఎన్నికల కోసం సిద్దమవుతున్నట్టు తెలిసింది. చదవండి: (రజనీ వెనుక కాషాయం!) అధినాయకత్వమే దిగినవేళ.. హైదరాబాద్ ఎన్నికల్లో హిందు–ముస్లిం అంశం ప్రధానంగా ఉండేలా బీజేపీ ప్రయత్నించినట్లు కన్పించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని హామీ ఇవ్వడం, ఎంఐఎం స్పందించడం తదితరాలతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చల్లో కెక్కాయి. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ఎన్నికల్లో ప్రచారం చేసి తన ముద్రను వేసుకున్నారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇలా బీజేపీ తన పూర్తి బలాన్ని వినియోగించింది. దీంతో హైదరాబాద్‌లో అధికార పార్టీ తెరాసకు తీవ్ర నష్టం వాటిల్లింది. 48 స్థానాలు దక్కించుకుని హైదరాబాద్‌లో రెండో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. ఇదే మాదిరిగా రాబోయే బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం చేసి మెజార్టీ సీట్లు కైవసం చేసుకునేందుకు ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు సమాచారం. చదవండి: (హైదరాబాద్ ఫలితాలతో నూతనోత్తేజం!) హిందుత్వ కార్డు పనిచేస్తుందా? హైదరాబాద్‌లో నడిచిన హిందుత్వం కార్డు ముంబైలో ఎంత వరకు ప్రభావం చూపనుందనేది ప్రశ్నార్థకమే. హిందుత్వం అంశంపై శివసేనపై బీజేపీ విమర్శలు గుప్పించవచ్చు కానీ, మిగతా అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మరింత పక్కా ప్రణాళికను రూపొం దించాలని కమలం పార్టీ భావిస్తోంది. అదేవిధంగా ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేందుకు అన్ని జాగ్రత్తలు ఇప్పటి నుంచి తీసుకుంటోంది. రాష్ట్రంలో జరిగిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బీజేపీకి షాక్ నిస్తూ నాగ్‌పూర్, పుణే, ఔరంగాబాద్ మొదలగు పెట్టనికోటగా ఉన్న స్థానాలను బీజేపీ కోల్పోయింది. మహావికాస్ ఆఘాడీ ఐక్యతతో పోరాడటంతో బీజేపీపై విజయం సాధించగలిగారు. ఇలాటి నేపథ్యంలో బీఎంసీలో కూడా శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు ఒక్కటిగా మహావికాస్ ఆఘాడిగానే పోటీ చేయాలని భావిస్తున్నాయి. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే రెట్టింపు బలంతో బీజేపీకి ఎన్నికల బరిలోకి దిగాల్సి రానుంది. బీఎంసీ ఎన్నికల్లో మహావికాస్ ఆఘాడీని అడ్డుకోవడంలో బీజేపీ ఎంత వరకు సఫలీకృతం కానుందని రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది. -
ఫలితాలు: ఆర్వోలదే తుది నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కౌంటింగ్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులదే (ఆర్వోలు) తుది నిర్ణయమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి పేర్కొన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని, బాధ్యతాయుతంగా ఈ పని పూర్తి చేయాలని సూచించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి పూర్తి అధికారం రిటర్నింగ్ అధికారులదేనని పేర్కొన్నారు. కోవిడ్–19 నిబంధనలు తప్పక పాటించాలని, కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పకుండా ధరించాలని ఆదేశించారు. గురువారం జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారి/ కమిషనర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, ఆర్వోలతో కౌంటింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫలితాలను పరిశీలకుల ఆమోదం తర్వాతే రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించి, పారదర్శకంగా నిర్వహిం చాలని, స్ట్రాంగ్ రూంను అభ్యర్థి లేదా వారి ఏజెంట్ సమక్షంలో ఉదయం 7.45 గంటలకు తెరవాలని చెప్పారు. సందేహాత్మక బ్యాలెట్ పేపర్లపై రిట ర్నింగ్ అధికారులదే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహించాలని, ప్రతి రౌండు తర్వాత ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ ఏజెంట్ల సంతృప్తి మేరకు వారి సంతకాలు తీసుకోవాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు కౌంటింగ్ సెంటర్‌లోనికి అనుమతించరాదని పేర్కొన్నారు. హాల్ చిన్నగా ఉన్న 16 వార్డులలో 7 టేబుళ్ల చొప్పున రెండు కౌంటింగ్ హాల్స్‌కు అనుమతిస్తూ ఆర్వోలు, అదనపు ఆర్వోలను కేటాయించినట్లు ఆయన తెలిపారు. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8,152, ఒక్కో రౌండ్‌కు 14,000 ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు. 74,67,256 మంది ఓటర్లకుగాను 34,50,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని, 1,926 పోస్టల్ బ్యాలెట్స్ జారీ చేశారన్నారు. -
వాపు చూసి బలుపు అనుకుంటున్నారు: పొన్నం
కరీంనగర్ : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడి విజయం సాధించిందని, వాపును చూసి బలుపనుకోవడం తగదని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాతీర్పుకు కట్టుబడి ఉందని, గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించే విధంగా టీఆర్ఎస్ డివిజన్ల విభజన, రిజర్వేషన్లు చేసి తమకు అనుకూలంగా మలుచుకుందన్నారు. ఇతర పార్టీల నాయకులను ప్రలోభపెట్టి టీఆర్ఎస్లో చేర్చుకున్నారన్నారు. విద్యుత్ బకాయిలు, నీటి పన్నుల రద్దు, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ, డబుల్ బెడ్రూం ఇళ్ల హామీలతో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికార పార్టీ జీహెచ్ఎంసీలో గెలిచిందని ఆరోపించారు. -
కాంగ్రెస్, టీడీపీలకు మైండ్ బ్లాక్: హరీష్‌రావు
నారాయణఖేడ్ (మెదక్) : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్, టీడీపీల మైండ్ బ్లాక్ అయ్యిందని, రెండు పార్టీలు చిత్తు చిత్తుగా పొట్టు పొట్టుగా అయ్యాయని మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. నారాయణఖేడ్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ ఫలితాలతో ఆయా పార్టీల నాయకులు ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. వరంగల్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలను దెబ్బకొట్టిన ప్రజలు.. రేపు నారాయణఖేడ్‌లోనూ దెబ్బ మీద దెబ్బ కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. హైదరాబాద్‌లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ తమకు వద్దని కరివేపాకు మాదిరిగా తీసిపారేశారన్నారు. ఏదో దిష్టి తగలకుండా ఉండేందుకు రెండు సీట్లు ఇచ్చారన్నారు. ఖేడ్‌లో మాత్రం కాంగ్రెస్, టీడీపీలకు డిపాజిట్లు రావన్నారు. హైదరాబాద్‌లో చెల్లని రూపాయి ఖేడ్‌లో చెల్లుతుందా అంటూ మంత్రి ప్రశ్నించారు. -
టీడీపీకి సనత్ నగర్ షాక్
హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో ఘోర పరాజయం రాజకీయంగా టీడీపీ భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చగా, సనత్ నగర్ నియోజకవర్గం ప్రజలు మరో షాకిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తలసాని శ్రీనివాస యాదవ్ పార్టీకి రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఎలా ఉంటారని టీడీపీ ప్రశ్నించింది. ఆ విషయంపై స్పీకర్‌తో పాటు గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. పార్టీ ఫిరాయింపులపై కోర్టును కూడా ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించినప్పుడు ఏ పార్టీ అయినా సర్వసాధారణంగా చేసేవే. ఇవిలా ఉండగా, గ్రేటర్ ఎన్నికల ద్వారా తలసానికి టీఆర్ఎస్కు గట్టి షాకివ్వాలని టీడీపీ వ్యూహరచన చేసింది. దమ్ముంటే సనత్ నగర్ లో పోటీ చేసి మళ్లీ గెలవాల్సిందిగా టీడీపీ నేతలు అనేకసార్లు సవాలు చేసిన నేతలు ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లు గెలుచుకోవడానికి గట్టి వ్యూహం రచించారు. ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించిన చంద్రబాబు కుమారుడు లోకేశ్ అభ్యర్థులకు అవసరానికి మించి సహాయం అందించారు. పార్టీ శ్రేణులను పురామాయించడంతో పాటు రోజు వారిగా సమీక్ష జరిపారు. ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లను గెలుచుకోవడం ద్వారా తలసానిపై రాజీనామా ఒత్తిడి పెంచొచ్చని భావించారు. ఇక్కడి నుంచి త్వరలో అసెంబ్లీ ఉపఎన్నికలు తప్పవని పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అయిదు డివిజన్లు ఉన్నాయి. అమీర్ పేట, సనత్ నగర్, బేగంపేట, బన్సీలాల్ పేట, రాంగోపాల్ పేట డివిజన్లలో ప్రత్యేక ప్రచారం నిర్వహించడంతో పాటు ఇక్కడ పార్టీ అత్యధికంగా నిధులు సమకూర్చింది. చంద్రబాబు నాయుడు సైతం టెలి కాన్ఫరెన్స్ ద్వారా నేతలతో మాట్లాడుతూ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. రాజకీయంగా ఈ ఎన్నికలు ఎంతో ఉపయోగపడుతాయన్న టీడీపీ అంచనాలు ఫలితాలతో తారుమారయ్యాయి. సనత్ నగర్ ప్రజలు టీడీపీ నాయకత్వానికి పెద్ద షాకిచ్చారు. ఈ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లు కలిపి 24,700 లకు పైగా ఓట్ల మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం పరిధిలోని రెండు డివిజన్లను బీజేపీకి కేటాయించగా ఆ రెండింటిలోనూ ఘోర పరాజయం చవి చూడాల్సి వచ్చింది. ఊహించని ఫలితం రావడంతో ఇక్కడ ఇంచార్జీగా వ్యవహరించిన రాష్ట్ర పార్టీ నేతలెవరు తెరమీదకు రావడం లేదు.