
తిరుపతి తుడా: మునెయ్య.. ఆరేళ్లక్రితం వరకు తిరుపతి మునిసిపాలిటీలో అటెండర్‌గా పనిచేశారు. కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన తిరుపతికి ఈసారి మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు. మునెయ్య కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా ఎన్నికయ్యారు. ముప్పై ఏళ్లు సేవలందించిన ఆయన రెవెన్యూ విభాగంలో దఫేదార్(అటెండర్)గా ఆరేళ్లక్రితం రిటైరయ్యారు.
అటెండరుగా తాను పనిచేసిన సంస్థకు తన కోడలు మేయరుగా ఎంపిక కావడంపై మునెయ్య, ఆయన కుటుంబీకుల ఆనందానికి పట్టపగ్గాల్లేవు. మునెయ్యకు ఇద్దరు కుమారులు. వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రి అధినేత డాక్టర్ మునిశేఖర్ పెద్దకుమారుడు. ఈయన భార్యే డాక్టర్ శిరీష. చిన్న కుమారుడు తులసీయాదవ్ టౌన్‌బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. వైఎస్సార్ జిల్లా కొర్రపాడుకు చెందిన శిరీష 1980లో జన్మించారు. తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తిచేసి, కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాలనుంచి 2011లో డీజీవో పట్టా పుచ్చుకున్నారు. కొంతకాలం తిరుపతిలోని ఆశాలత టెస్ట్‌ట్యూబ్ బేబీ సెంటర్‌లో గైనకాలజిస్ట్‌గా పనిచేశారు. మునిశేఖర్‌ను వివాహం చేసుకున్న తర్వాత ఆయనతోపాటు వైష్ణవి చిన్నపిల్లల ఆస్పత్రిలో వైద్య సేవలందిస్తున్నారు.
చదవండి:
రాయచోటి మున్సిపల్ చైర్మన్‌గా కూరగాయల వ్యాపారి
రాష్ట్ర ప్రాజెక్టులు భేష్: నాబార్డు చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment