
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలో నిధులు స్వాహా చేసిన ఉదంతంలో అరెస్టుల పర్వం ప్రారంభమైంది. ఆరేళ్ల క్రితం నకిలీ బిల్లు పుస్తకాలను ముద్రించి అక్రమాలకు పాల్పడిన ఉద్యోగుల్లో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ-2 రేఖల అరుణకారి, ఏ-12 సత్యనారాయణ, ఏ-16 ఈశ్వరయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 2010-2014 మధ్యలో నల్లా బిల్లు, ఇంటి నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్నును మున్సిపాలిటీ ఖాతాలో జమచేయని ఉద్యోగులు, మొత్తం రూ. 5.04 కోట్ల అవినీతికి పాల్పడ్డారు.
మొత్తం 29 మంది ఉద్యోగులు, 18 మంది పర్యవేక్షణా అధికారులపై 2015లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మిగతా ఉద్యోగుల అరెస్ట్‌కు రంగం సిద్ధం అయింది. అవినీతి ఉద్యోగుల్లో మొదలైన టెన్షన్ మొదలైంది. మిగతా ఉద్యోగులు సెలవు పెట్టి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఇప్పటికే నలుగురి మృతి చెందారు. మిగతావారిని నేడో, రేపో అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: Karimnagar: అత్తగారింట్లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment