
సిద్దిపేటజోన్: ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో సిద్దిపేట మున్సిపాలిటీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో టాప్ –10లో ఉంది. పట్టణంలో పరిశుభ్రత, చెత్త సేకరణ, ఓడీఎఫ్, తదితర అంశాల్లో మీ అభిప్రాయాలను ఫీడ్‌బ్యాక్ రూపంలో అందించి సిద్దిపేటను మరింత ఆశీర్వదించండి. మీ అభిప్రాయంతో సిద్దిపేట మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నంబర్ 1గా నిలవాలి. అందుకు మీ చైతన్యం ఎంతో అవసరం. జనవరి 31లోగా ప్రతి పౌరుడు ఫీడ్‌బ్యాక్ అందించి మద్దతు తెలపాలి’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పట్టణ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ యేడు స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో సిద్దిపేట మున్సిపాలిటీ పాల్గొంటోందని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామై పట్టణాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి మన గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment