Pure survey
-
‘సిద్దిపేటను గెలిపిద్దాం..’
సిద్దిపేటజోన్: ‘స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో సిద్దిపేట మున్సిపాలిటీ ప్రస్తుతం జాతీయ స్థాయిలో టాప్ –10లో ఉంది. పట్టణంలో పరిశుభ్రత, చెత్త సేకరణ, ఓడీఎఫ్, తదితర అంశాల్లో మీ అభిప్రాయాలను ఫీడ్‌బ్యాక్ రూపంలో అందించి సిద్దిపేటను మరింత ఆశీర్వదించండి. మీ అభిప్రాయంతో సిద్దిపేట మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నంబర్ 1గా నిలవాలి. అందుకు మీ చైతన్యం ఎంతో అవసరం. జనవరి 31లోగా ప్రతి పౌరుడు ఫీడ్‌బ్యాక్ అందించి మద్దతు తెలపాలి’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పట్టణ పౌరులకు విజ్ఞప్తి చేశారు. ఈ యేడు స్వచ్ఛ సర్వేక్షణ్–2019లో సిద్దిపేట మున్సిపాలిటీ పాల్గొంటోందని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామై పట్టణాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపి మన గౌరవాన్ని మరింత ఇనుమడింప చేయాలని సూచించారు. -
కౌసర్ షాహిన్..
ధర్మసాగర్: కష్టాల కడలిలో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ మహిళకు పొదుపు సంఘం దారి చూపి జీవితాన్నే మలుపుతిప్పింది. వరంగల్ జిల్లా వేలేరు మండల కేంద్రానికి చెందిన కౌసర్ షాహిన్ పదో తరగతి పూర్తి కాగానే 16 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు వివాహం చేయడంతో అత్తారింట్లో అడుగుపెట్టింది. అధిక సంతానంతో కడు పేదరికంలో ఉన్న అత్తారింట్లో తెలిసి తెలియని వయసులోనే కష్టాలు పడుతూ కాపురం చేసింది. వెను తి రిగి చూస్తే 25 సంవత్సరాలు వచ్చే వరకు బాబు, పా పతో బాధ్యతలు మొదలయ్యాయి. కష్టం చేసి పోషిం చాల్సిన భర్త తాగుడుకు బానిస కావడంతో తప్పని సరి పరిస్థితుల్లో భర్త నుంచి దూరంగా ఉండే ఉద్దేశ్యం తో సొంతూరు వేలేరుకు పిల్లలతో సహ చేరింది. వ్యవసాయ కూలీగా.. గ్రామానికి చేరిన కౌసర్ షాహిన్ తను, తన పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశ్యంతో వ్యవసాయ కూలీగా పని చేస్తూ.. వచ్చిన కొద్ది మొత్తాన్ని జాగ్రత్తగా పొదుపు చేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటుంది. పిల్లలు ఎదగడం, నిత్యం పని కోసం ఎదురుచూడడం, కొన్ని సందర్భాల్లో పూట గడవడమే కష్టంగా మారేది. దీంతో తాను ఎంత కష్టపడైనా సరే జీవితంలో తన పిల్లలకు తనలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చూడాలని ధృడసంకల్పానికి వచ్చింది. మలుపు తిప్పిన పొదుపు సంఘం.. ఈ క్రమంలోనే గ్రామంలో కనకదుర్గ మహిళా పొదుపు సంఘం ప్రారంభిస్తున్నామని, తనను కూడా అందులో చేరమని ఇంటి పక్కన మహిళలు ఇచ్చిన సమాచారంతో తల్లిదండ్రులతో చెప్పకుండానే అందులో సభ్యురాలిగా చేరింది కౌసర్ షాహిన్. సంఘంలో చేరిన తొలి రోజుల్లో సంఘంలో పొదుపు చేయటం, ఇంట్లో వారికి తెలియకుండా సంఘం మీటింగ్‌లకు హాజరవుతుండేది. ఈ నేపథ్యంలో తొలిసారిగా 2007వ సంవత్సరంలో సంఘం అప్పు తీసుకుని కుట్టుమిషన్ కొనుగోలు చేసింది. అనంతరం వ్యవసాయ కూలీతోపాటు, కుట్టుమిషన్ ద్వారా వచ్చే ఆదాయంతో ఇద్దరు పిల్లలను పోషించేది. అప్పటి వరకు కూడా అరకొరగా రాబడి ఉండటంతో ఇబ్బందులు సైతం వెంటాడుతూనే ఉన్నాయి. 2011లో కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ (సీఆర్పీ)గా ఇతర రాష్ట్రాల్లోని మహిళలకు శిక్షణ ఇచ్చి మహిళా పొదుపు సంఘాలపై అవగాహన కల్పించే అవకాశం వచ్చింది. ఇంట్లో వాళ్లు వ్యతిరేకించినప్పటికీ వారికి సమాధానం చెప్పి, ఓరుగ ల్లు మహిళా సమాఖ్య నుంచి మధ్యప్రదేశ్‌లో మహిళలకు శిక్షణ ఇచ్చింది. అది మొదలు ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో సీఆర్పీగా సేవలు అందించి వేల మంది మ హిళలకు అవగాహన కల్పించింది. అందులో ప్రతి శిక్షణలో తన జీవితాన్నే పాఠంగా చెబుతూ మహిళా సం ఘంలో చేరటం ద్వారా లా భాలను వివరిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలు స్తుంది కౌసర్ షాహిన్. ఈ క్రమంలోనే ఆర్థికంగా నిలదొక్కుకుని తన బాబు, పాప ను ఓ ప్రైవేట్ విద్యాసంస్థలో చేర్పించి చదువు చెప్పిస్తుం ది. కాగా ఈ నెల 12వ తేదీ న ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడే అవకాశం దక్కడంతో అన్ని వైపుల నుంచి ప్ర శంసలు వెల్లువెత్తటంతో పా టు, తాజాగా స్వచ్ఛ సర్వేక్షణ్ వరంగల్ అర్బన్ జిల్లా అంబాసిడర్‌గా కూడా ఎం పికైంది. మహిళా సంఘం ప్రోత్సాహం మరువలేనిది.. నేను ఈ స్థాయిలో నిలిచేందుకు తోటి మహిళా సంఘం సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. సంఘంలో చేరిన తొలి రోజుల్లో ఎవరితో మాట్లాడాలన్నా భయంగానే ఉండేది. క్రమంగా అందరితో కలిసిపోయాను. బయటి రాష్ట్రాలకు వెళ్లినప్పుడు సైతం ఇబ్బందులు ఎదురైన సందర్భాల్లో తోటి సభ్యులు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు. సీఆర్పీగా ఎంపికై ప్రధానీతో మాట్లాడే వరకు నాటి ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ తక్కళ్లపల్లి రవీందర్రావు సార్ ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. స్వచ్ఛ సర్వేక్షణ్ అర్బన్ జిల్లా అంబాసిడర్‌గా పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై గ్రామాల్లో అవగాహన కల్పిస్తా. – కౌసర్ షాహిన్ -
అందాల నగరి.. స్వచ్ఛ సొగసరి
⇒స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విశాఖకు మూడో ర్యాంకు ⇒దేశంలో 500 నగరాలతో పోటీపడి విజయం ⇒గత ఏడాది కంటే మెరుగుపడిన ర్యాంకు ⇒ఢిల్లీలో కేంద్ర అవార్డు స్వీకరించిన కమిషనర్, కలెక్టర్ విశాఖపట్నం : అందాల నగరి విశాఖ మరో అవార్డును సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 500 నగరాలతో పోటీపడి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మూడో ర్యాంకు సాధించింది. గత ఏడాది సాధించిన ఐదో ర్యాంకును అధిగమించడం ద్వారా తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 500 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా నగరాలకు ర్యాంకులు ప్రకటించారు. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత జనవరి 7 నుంచి 9వ తేదీ వరకూ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరిగింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక కేంద్ర బృందం ఈ సర్వే నిర్వహించింది. గత ఏడాది 75 నగరాలతో పోటీ పడి జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిన జీవీఎంసీని ఈసారి అంతకంటే మెరుగైన ర్యాంకులో నిలపాలని కమిషనర్ హరినారాయణన్ తీవ్రంగా ప్రయత్నించారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బందిని నిరంతరం ప్రోత్సహిస్తూ కార్యోన్ముఖులను చేసి విజయం సాధించారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయు డు నుంచి జీవీఎంసీ ప్రత్యేకాధికారి అయిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, కమిషనర్ హరినారాయణన్ ఈ అవార్డును అందుకున్నారు. చేపట్టిన చర్యలివి.. స్వచ్ఛ సర్వేక్షణ్ పథకంలో భాగంగా నగరంలో లక్ష జనాభాకు సరిపోయేలా 138 సామూహిక మరుగుదొడ్డు నిర్మించారు. మరో 55 సామూహిక మరుగుదొడ్లను ఆధునికీకరించారు. ఆరు రైతు బజార్లలో వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేశారు. మోడల్ కాలనీల్లో తడి–పొడి చెత్త విభజన, సేకరణ చేపట్టారు. బీచ్ రోడ్డు, జాతీయ రహదారి, బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో టాయిలెట్లు నిర్మించి, గోడలకు రంగులు వేశారు. వ్యాపార కూడళ్లలో చెత్త వేయడానికి డస్ట్‌బిన్స్, డంపర్‌బిన్స్ ఏర్పాటు చేశారు. ఈ లెర్నింగ్ ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సు, స్వచ్ఛత యాప్ ఉపయోగించడంలో దేశంలోనే మొదటి స్ధానంలో జీవీఎంసీ నిలిచింది. సమష్టి కృషితోనే మెరుగైన ర్యాంకు: కమిషనర్ జీవీఎంసీకి చెందిన అందరు అధికారులు, సిబ్బంది.. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికుల సమష్టి కృషితోనే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మూడవ ర్యాంకు సాధించగలిగామని జీవీఎంసీ కమిషనర్ హరినా రామణన్ అన్నారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఈ విజయంలో భాగస్వాములైన అందరికీ అభినందనలు తెలిపారు. నగర ప్రజల సహకారం కూడా మరువలేనిదని.. మరిన్ని విజయాలు సాధించడానికి ఈ అవార్డు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.కాగా హరినారాయణన్ ఢిల్లీ నుంచి నేరుగా న్యూయార్క్‌లో జరిగే స్మార్ట్‌సిటీల సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్నారు. పరిశీలించిన అంశాలు ర్యాంకుల ప్రకటనకు కొన్ని నిర్దిష్ట అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వాటిపై ఆన్లైన్లో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. అవేంటంటే.. సమాచార, విద్యా వ్యవస్థ భవనాల నిర్మాణం తాగునీటి సరఫరా స్వచ్ఛభారత్ మిషన్ మరుగుదొడ్ల నిర్మాణం సాలిడ్‌వేస్ట్ మేనేజ్మెంట్ -
తిరుపతికి స్వచ్ఛ కిరీటం
⇒దేశంలో 9వ ర్యాంకు కైవసం ⇒చిత్తూరుకు 71, శ్రీకాళహస్తికి 119 ⇒అట్టడుగున మదనపల్లె ⇒ ఢిల్లీలో ‘తిరునగరి’ అవార్డు అందుకున్న అధికారులు చిత్తూరు (అర్బన్), తిరుపతి తుడా: తిరుపతి అరుదైన గౌరవం దక్కించుకుంది. స్వచ్ఛ సర్వేక్షణ్ – 2017 అవార్డుల్లో నగరం 9వ ర్యాంక్‌ను కైవసం చేసుకుంది. ఢిల్లీ నేషనల్ మీడియా సెంటర్లో గురువారం స్వచ్ఛసర్వేక్షణ్ ర్యాంకులను కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. జిల్లా కలెక్టర్, నగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి పి.ఎస్. ప్రద్యుమ్న,కార్పొరేషన్ పూర్వపు కమిషనర్ వినయ్‌చంద్, సెక్రటరీ బాలస్వామి, ఈ అవార్డును కేంద్రమంత్రి నుంచి అందుకున్నారు. నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రత ఎలా పాటిస్తున్నారో తెలుసుకోవడానికి రెండేళ్లుగా కేంద్రం ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ పేరిట పోటీలు పెడుతోంది. దేశంలోని ఉత్తమ ర్యాంకులు సాధించిన నగరాలు, పట్టణాలకు అవార్డులు ఇవ్వడం, సుందరీకరణకు నిధులు విడుదల చేస్తోంది. ఈ ఏడాది జిల్లా నుంచి రెండు కార్పొరేషన్లు, రెండు మునిసిపాలిటీలు పోటీ పడ్డాయి. దేశవ్యాప్తంగా 434 పట్టణాలు పాల్గొనగా మన జిల్లాలో తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లతో పాటు శ్రీకాళహస్తి, మదనపల్లె మున్సిపాలిటీలు ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రాథమిక అర్హత సాధించాయి. తిరుపతి జాతీయ స్థాయిలో 9వ ర్యాంకు అందుకోగా చిత్తూరు 71, శ్రీకాళహస్తి 119, మదనపల్లె 281వ స్థానాల్లో నిలిచాయి. ఇవీ ప్రమాణాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో నాలుగు ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఇందులో ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (బహిరంగ ప్రాంతాల్లో మల మూత్రాల విసర్జన నిషేధం), ఆన్లైన్, ఫోన్ల ద్వారా ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం, క్షేత్ర స్థాయికి వెళ్లి వాస్తవాలను పరిశీలించే అంశాలను పొందుపరిచారు. ఈ నాలుగు అంశాలకు 2,000 మార్కులు కేటాయించారు. తిరుపతికి 1,704 మార్కులు రావడం విశేషం. కాగా మదనపల్లె మున్సిపాలిటీ రాష్ట్రంలోనే అట్టడుగున నిలిచింది.