హైదరాబాద్: మమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకునే భర్త అనారోగ్యంతో చనిపోయాడు... మాకు రావలసిన ఆస్తిని తన పిల్లలకు కాకుండా ఆడపడుచులకు ఇచ్చి అత్త అన్యాయం చేస్తుందని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఓ మహిళ మౌన దీక్షకు దిగింది. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెలితే... మణికొండ గ్రామ పంచాయతీకి వార్డు సభ్యునిగా పనిచేసిన ధన్‌రాజ్ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మరణించాడు.
దాంతో ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుని భారం భార్య సుధారాణిపై పడింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ వారిని చదివిస్తుంది. తన భర్త సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు చెందనివ్వకుండా అత్త యాదమ్మ ఇటీవల ఆడపడుచులు సావిత్రి, రేణుకల పేరుపైకి మార్చింది. అది తెలిసి తనకు న్యాయం చేయాలని కాలనీ, గ్రామ పెద్దలకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోయింది.దీంతో పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలని శివాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మౌన దీక్షకు దిగింది.
వారంలో న్యాయం చేస్తాం...
ఆమె పరిస్థితిని తెలుసుకుని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్, వార్డు కౌన్సిలర్ యాలాల లావణ్య నరేష్, రాయదుర్గం పోలీసులు స్పందించి వారం రోజుల్లో చర్చించి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. దాంతో ఆమె ఆందోళనను విరమించింది.
Comments
Please login to add a commentAdd a comment