
సాక్షి, చిత్తూరు: కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి, చంద్రబాబు పీఏ మనోహర్ దాడికి దిగారు. అద్ధాలు ధ్వంసం చేసి, ఫర్నిచర్‌ను టీడీపీ నేతలు విసిరేశారు. 14వ వార్డు అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణపై మండపడ్డ టీడీపీ నేతలు.. దాడికి దిగారు. మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నా టీడీపీ నేతలు ఆగలేదు. కార్యాలయంపై దాడి చేసి మరీ, టీడీపీ నేతలు ధర్నాకు కూర్చున్నారు.
Comments
Please login to add a commentAdd a comment