హుజూర్‌నగర్‌లో నిరసన వ్యక్తం చేస్తున్ననాయకులు
సాక్షి, చింతలపాలెం (హుజూర్‌నగర్) : హుజూర్‌నగర్ మున్సిపాలిటీలో వార్డులను పెంచాలని కోరుతూ పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్క్‌ర్ వ్రిగహానికి పూలమాలలు వేసి, విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మేజర్‌గ్రామ పంచాయతీని నగరపంచాయతీగా, ఆ తర్వాత గ్రేడ్3 మున్సిపాలిటీగా ఏర్పడినప్పటికీ 20 వార్డులుగానే ఉండటం శోఛనీయమన్నారు. నూతన ఓటర్లతో కలుపుకుని సుమారు 29వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారని, ప్రస్తుతం ఉన్న వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నాయని, వాటిని సరిచేసి వార్డులు సంఖ్యను పెంచాలని వారు డిమాండ్ చేశారు. గతంలో డీలిమిటేషన్‌లో వార్డుల పునర్విభజన చేయలేదన్నారు. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జనాభా సంఖ్యను దృష్టిలో ఉంచుకుని నిబంధనల ప్రకారం కొత్తగా మరో 6 వార్డులను పెంచేందుకు అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండీ అజీజ్ పాషా, వార్డు కౌన్సిలర్ మన్నీరు మల్లిఖార్జున్‌రావు, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ మన్సూర్ అలీ, నాయకులు చిట్యాల అమర్‌నాధ్‌రెడ్డి, యరగాని గురవయ్య, ఎంఏ మజీద్, బాచిమంచి గిరిబాబు, పులిచింతల వెంకటరెడ్డి, నాగేశ్వరరావు, బిక్కన్‌సాబ్, కోలమట్టయ్య, రామిశెట్టి మురళిప్రసాద్, మహేష్ గౌడ్, పెద్దబ్బాయి, ముత్తయ్య, రాములు, జగన్, నర్సింహారావు, మల్లయ్య, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment