నిర్మానుష్యంగా మారిన తుక్కుగుడ శ్రీశైలం జాతీయ రహదారి
సాక్షి, రంగారెడ్డి: మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగుడ మున్సిపాలిటీ పరిధిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2200 డబుల్ బెడ్రూం ఇళ్లల్లోనూ స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇవ్వడంతో ఆందోళనకు దిగారు స్థానిక ప్రజలు.
కాగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మంకాల, తుక్కుగూడ, రావిరాల్, సర్దార్ నగర్ , ఇమామ్ గూడ గ్రామ ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ఇళ్లు కేటాయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తమకు కాకుండా.. పాతబస్తీ మలక్‌పేట్, చార్మినార్, చాంద్రాయణ్‌గుట్ట , యాకత్‌పురకు చెందిన వారికి ఇవ్వడాన్ని నిరసిస్తూ స్థానిక నాయకులందరూ కలిసికట్టుగా జేఏసీగా ఏర్పడి మున్సిపాలిటీ బంద్‌కు పిలుపునిచ్చారు.
జేఏసీ పిలుపు మేరకు ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించి మున్సిపాలిటీలోని అన్ని గ్రామాల ప్రజలు భారీ నిరసన ర్యాలీ ప్రారంభించారు...
Comments
Please login to add a commentAdd a comment