‘క్లీన్ ఆఫ్ మార్షల్స్’ పునఃప్రారంభం
♦ నిర్ణయం తీసుకున్న బీఎంసీ
♦ టెండర్ల ప్రక్రియ ప్రారంభం
సాక్షి, ముంబై : కొన్ని నెలల కిందట రదు ్ద చేసిన ‘క్లీన్ ఆఫ్ మార్షల్స్’ పథకాన్ని పునఃప్రారంభించాలృ బహన్‌ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందుకోసం టెండర్లు ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభించింది. అయితే ముందు జాగ్రత+్త చర్యగా క్లీన్ ఆఫ్ మార్షల్స్‌కు అప్పగించిన కొన్ని అధికారాలను తగ్గించాలని నిర్ణయించింది. రోడ్లు, ఫూట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు విసర్జించడం, బట్టలు ఉతకడం, వాహనాలు శుభ్రం చేయడం, ఉమ్మివేయడం, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం వంటి పరిసరాలను అశుభ్రపరిచే చర్యలకు పాల్పడే వారికి శిక్ష విధించేందుకు 2007లో క్లీన్ ఆఫ్ మార్షల్స్ పథకాన్ని బీఎంసీ ప్రారంభించింది.
ఇందుకోసం ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఒక్కో వార్డుకు 11 మంది చొప్పున మార్షల్స్‌ను నియమించింది. ప్రారంభంలో అంతా సవ్యంగానే సాగినా, రానురాను ఈ అధికారాలను కొందరు దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. షాపులు, క్లినిక్‌లు, హాకర్స్‌ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడడం, జరిమానా పేరుతో ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో బీఎంసీ ఈ పథకాన్ని రెండేళ్లకే అటకెక్కించింది. తరువాత రెండుసార్లు పునఃప్రారంభించినా మళ్లీ రద్దు చేసింది. కాని ఈ సారి పకడ్బంధీగా మార్షల్స్ నియామక ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు కొత్త కంపెనీకి కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది.