tenders process
-
పారదర్శకతకు అసలైన అర్థం
సాక్షి, అమరావతి: ముందస్తు న్యాయ పరిశీలన బిల్లు పారదర్శకతకు అసలైన అర్థం చెబుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. టెండర్ల విధానంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ అవినీతికి అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా తీసుకొచ్చిన ‘ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాలు (న్యాయపరమైన ముందస్తు పరిశీలన ద్వారా పారదర్శకత) చట్టం–2019’ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందడంపై సీఎం ట్విట్టర్ వేదికగా స్పందించారు. ముందస్తు న్యాయ పరిశీలన బిల్లు ఆమోదం అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగన్నారు. దేశానికి, అంతర్జాతీయ సమాజానికి సరైన సందేశం పంపించామన్నారు. రూ.100 కోట్లు, ఆపై ఏ టెండరైనా హైకోర్టు చీఫ్ జస్టిస్ నియమించే సిట్టింగ్ లేదా రిటైర్డ్ జడ్జికి పంపుతామని, ఆయన ఆదేశాలను తప్పక పాటిస్తామని ఈ ట్వీట్లో వైఎస్ జగన్ పేర్కొన్నారు. కార్గిల్ అమర వీరుల త్యాగాన్ని ఈ దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుంది కార్గిల్ యుద్ధ అమరవీరులు చేసిన త్యాగానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వారి త్యాగాన్ని, ఆ వీరులు ప్రదర్శించిన ధైర్య సాహసాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం స్మరించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఘన నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. ‘భారతదేశ పరిరక్షణలో అమరులై కార్గిల్ యుద్ధంలో ఘన విజయం సాధించిన వీరులకు కృతజ్ఞతాంజలులను ఘటిస్తున్నాను. ఈ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ యోధుల త్యాగ నిరతిని, వీరోచిత సాహసాన్ని ఈ దేశం ఎన్నటికీ మరువదు’ అని జగన్ ట్విటర్లో పేర్కొన్నారు. -
‘విమ్స్’లో కమీషన్ల దందా!
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్ర ప్రాణదాతగా పేరుగాంచిన విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్)ను ప్రభుత్వ పెద్దలు కమీషన్ల కోసం ప్రైవేట్‌కు అప్పజెప్పారు. రాత్రికి రాత్రే నిబంధనలు మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిం చారు. ఇప్పటిదాకా రూ.300 కోట్లు వెచ్చించి, అభివృద్ధి చేసిన ఆసుపత్రిని ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిన తీరు అధికారవర్గాల్లో చర్చనీయాం శంగా మారింది. విమ్స్ ప్రైవేటీకరణతోపాటు ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రోగులు చికిత్స పొందే ప్రైవేట్ ఆస్పత్రులపై అజమాయిషీ కోసం ‘క్లినికల్ ఆడిట్’ పేరుతో ఓ కాంట్రాక్టు, మాతా శిశుమరణాలు తగ్గించే మరో కాంట్రా క్టును బాగా కావాల్సిన వారికే అప్పగించారు. ఈ కాంట్రాక్టుల అప్పగింత వెనుకరూ.కోట్ల కమీషన్లు చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గడువుకు ముందే కానిచ్చేశారు ఎక్కడైనా టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తే, బిడ్లు దాఖలు చేసుకునేందుకు తగినంత గడువు ఇస్తారు. విమ్స్ ప్రైవేటీకరణలో భాగంగా రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల సంస్థ(ఏపీఎంఎస్ఐడీసీ) టెండర్ పిలిచింది. బిడ్ల దాఖలుకు జూన్ 18వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. కానీ, తమకు బాగా కావాల్సిన బిడ్డర్లు బిడ్లు దాఖలు చేయగానే జూన్ 6వ తేదీనే టెండర్ ప్రక్రియ ముగించారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) నిబంధనల ప్రకారం ఒకసారి టెండర్ పిలిస్తే గడువుకు ముందే ముగించకూడదు. కావాలంటే టెండర్ గడువును ఇంకా పొడిగించుకోవచ్చు. అంతేతప్ప గడువుకు ముందే ముగించడం నిబంధనలకు విరుద్ధమే. ఏపీఎంఎస్ఐడీసీ నిర్వాకం వల్ల చాలామంది బిడ్లు దాఖలు చేయలేకపోయారు. రాత్రికి రాత్రే ఈఎండీ తగ్గింపు ఏ టెండర్లో అయినా ఎర్నెస్ట్ డిపాజిట్ మనీ(ఈఎండీ) నిబంధన ఉంటుంది. విమ్స్ ప్రైవేటీకరణ టెండర్లలో ఈఎండీ రూ.25 లక్షలుగా నిర్దేశించారు. జూన్ 5వ తేదీన ఏపీఎంఎస్ఐడీసీ ఇంజనీర్‌కు సచివాలయంలోని ముఖ్యకార్యదర్శి పేషీ నుంచి ఈ–మెయిల్ వెళ్లినట్లు సమాచారం. రూ.25 లక్షలున్న ఈఎండీని రూ.లక్షకు తగ్గించాలన్నదే ఆ ఈ–మెయిల్ సారాంశం. ముఖ్యమంత్రి కార్యాలయ ఒత్తిళ్ల మేరకే సదరు ఈ–మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైద్య ఆరోగ్యశాఖ సలహాదారు కూడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌కు ఫోన్ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించినట్లు ఏపీఎంఎస్ఐడీసీ వర్గాలు చెప్పాయి. సీఎంఓ నుంచి ఆర్డర్ ఉందన్నారు ‘‘టెండర్‌ను గడువు కంటే ముందే ముగించిన విషయం వాస్తవమే. ఉన్నతాధికారులు చెప్పినందు వల్లే ఈఎండీని తగ్గించాం. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆర్డర్ ఉందని చెప్పారు. వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య రాతపూర్వకంగా ప్రతిపాదన పంపిన తర్వాతే చేశాను. దీనిపై నా పాత్ర ఏమీ లేదు’’ – రోహిణి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీఎంఎస్ఐడీసీ రూ.కోట్లు ఖర్చు చేసి ప్రైవేట్‌కు అప్పగిస్తారా? దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆలోచనల్లోంచి విమ్స్ పురుడు పోసుకుంది. దీన్ని హైదరాబాద్‌లోని నిమ్స్ కంటే ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆయన కలలుగన్నారు. విమ్స్ అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇప్పటిదాకా రూ.300 కోట్లు ఖర్చు చేసింది. ఇక్కడ చాలామంది సిబ్బంది పని చేస్తున్నారు. స్పెషలిస్టు డాక్టర్లున్నారు. ఇన్సోర్సింగ్ కింద వైద్యులు సేవలందిస్తున్నారు. మరో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ‘విమ్స్’ అద్భుతంగా తయారవుతుంది. ఎంబీబీఎస్ సీట్లు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అలాంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రభుత్వం పెద్దలు తమ స్వార్థం కోసం ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారు. తాజా నిబంధనల ప్రకారం ఐదు రకాల సేవలను ప్రైవేట్‌కు ఇచ్చేశారు. గుండెజబ్బుల చికిత్సలు, గ్యాస్ట్రో ఎంటరాలజీ చికిత్సలు, నియోనెటాలజీ అండ్ పీడియాట్రిక్, రీనల్ సర్వీసెస్ (కిడ్నీ సేవలు), స్పోర్ట్స్ ఇంజూరీ (ఎముకల శస్త్రచికిత్సలు, కీళ్ల మార్పిడి) చికిత్సలు ప్రైవేట్పరమయ్యాయి. ఈ సేవలను ధనుష్ టెక్నాలజీస్ అనే సంస్థకు కట్టబెట్టినట్టు సమాచారం. సాఫ్ట్వేర్ సేవలకు సంబంధించిన ఈ సంస్థకు ఆరోగ్య సేవల్లో ఎలాంటి అనుభవం లేదు. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఈ సంస్థకు అప్పగించారు. తాజాగా విమ్స్ కూడా అదే సంస్థ చేతుల్లోకి వెళ్లింది. పైన పేర్కొన్న సేవల్లో ఔట్‌పేషెంట్‌కు, ఇన్‌పేషెంట్‌కు, ఎక్స్‌రే, ఎంఆర్ఐ, ఎండోస్కొపీ ఇలా ఒక్కొక్క సేవకు ధర నిర్ణయించి ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. ఇదంతా ఏటా రూ.కోట్లలోనే ఉంటుందని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఒక్క ఏడాదిలో ప్రైవేట్ సంస్థకు చెల్లించే సొమ్ముతో విమ్స్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయొచ్చని అన్నారు. -
హైదరాబాద్‌లో లక్ష ‘డబుల్’ ఇళ్లు
సాక్షి, హైదరాబాద్: ఏడాదిలోగా హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశామని వెల్లడించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువు మేరకు 12 నెలల వ్యవధిలో నిర్మాణం పూర్తి చేసేందుకు పట్టుదలతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో డబుల్ ఇళ్ల నిర్మాణంపై గురువారం జల మండలి కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు, కాంట్రాక్టర్లతో సమావేశమయ్యారు. సకాలంలో పనులు పూర్తి చేస్తే కాంట్రాక్టర్లకు అదనపు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లకు జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. నిబంధనల మేరకు పాటించాల్సిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని కోరారు. వీటి నిర్మాణానికి ఇసుక సరఫరా కోసం తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎండీసీ) ఆధ్వర్యంలో నాలుగు ఇసుక డిపోలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పనులు పర్యవేక్షించాలని ఆదేశించారు. పనుల పర్యవేక్షణ కోసం అధికారులు, కాంట్రాక్టర్లు ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. డబుల్ ఇళ్ల నిర్మాణం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం అని, ఇందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఈ ఇళ్ల నిర్మాణంలో ఏవైనా ఇబ్బం దులుంటే తెలపాలని కాంట్రాక్టర్లకు కేటీఆర్ సూచిం చారు. కాంట్రాక్టర్లు తెలిపిన సమస్యలతోపాటు పలు అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నవం బర్‌లోగా అన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యేలా ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ సంద ర్భంగా నగర ఎమ్మెల్యేలు, అధికారుల సమావేశంలోనే ఫోన్ చేసి మాట్లాడారు. సమావేశంలో పురపాలక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు. -
‘డబుల్’ ఇళ్లకు బ్రేక్
⇒ ‘ఇన్‌సిటు’ నిర్మాణాలకు అభ్యంతరాలు ⇒ జోషివాడ, జియాగూడ, ఆర్కే నగర్లో వద్దంటున్న స్థానికులు గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు..రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారింది. ఈ సంవత్సరం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నా, కొన్ని ప్రాంతాల్లో ఎదురవుతున్న అవాంతరాల వల్ల పనులు ముందుకు సాగడం లేదు. దాదాపు 30 వేల ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయినా, స్థానికుల నుంచి అభ్యంతరాలతో కొన్ని చోట్ల, కోర్టు వివాదాల కారణంగా మరికొన్ని చోట్ల పనులు మొదలు కాని పరిస్థితి నెలకొంది. – సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: గ్రేటర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం క్లిష్టంగా మారుతోంది. ఈ సంవత్సరం లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినా, కొన్ని ప్రాంతాల్లో ఎదురవుతున్న సమస్యల వల్ల పనులు ముందుకు సాగడం లేదు. సమస్యల్ని పరిష్కరించి, నిర్మాణం ప్రారంభించేందుకు జాప్యం జరుగుతోంది. మొత్తం లక్ష ఇళ్లకుగాను 90,104 ఇళ్లకు అవసరమైన రూ.7742.58 కోట్లకు పరిపాలనా పరమైన ఆమోదం లభించినా, దాదాపు 30 వేల ఇళ్లకు టెండర్ల ప్రక్రియ పూర్తయినా, స్థానికుల నుంచి అభ్యంతరాలతో కొన్ని చోట్ల, కోర్టు వివాదాలతో కొన్ని చోట్ల పనులు మొదలు కాని పరిస్థితి నెలకొంది. 16 ప్రాంతాల్లో 9512 ఇళ్ల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభమయ్యాయి. లక్ష ఇళ్లకు సరిపడా అవసరమైనన్ని భూముల సేకరణ కూడా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మునిసిపల్‌మంత్రి కేటీఆర్‌లు త్వరితంగా డబుల్ ఇళ్లు పూర్తిచేయాల్సిందిగా ఆదేశించినప్పటికీ, అధికారులు నిస్సహాయులవుతున్నారు. తాజాగా మూడు ప్రాంతాల్లో స్థానికుల అభ్యంతరాలతో 1624 ఇళ్ల నిర్మాణం డోలాయమానంలో పడింది. దశల వారీగా నిర్మించాలి.. జియాగూడలో సిల్ట్ ప్లస్ 5 అంతస్తుల పద్ధతిలో 840 ఇళ్లకు టెండర్లు ఖరారయ్యాయి. ఇక్కడ ఇన్‌సిటు (ఎక్కడ ఉంటున్న వారికి అక్కడే..పాత ఇళ్లలో ఉంటున్న వారిని తరలించి, వాటిని కూల్చివేసి నిర్మించే పద్ధతి) విధానంలో డబుల్ ఇళ్లు నిర్మించేందుకు గతంలో నిర్మించిన, శిథిలావస్థకు చేరిన మున్సిపల్ క్వార్టర్స్‌ను కూల్చివేసి కొత్త ఇళ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. ఇందుకుగాను పాత ఇళ్లల్లో ఉంటున్న 563 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు కూడా జారీ చేశారు. అయితే కొత్త ఇళ్లు వెంటనే పూర్తవుతాయని తమకు నమ్మకం లేదని, ఎంతకాలం పడుతుందో తెలియనందున ఒక్కొక్క బ్లాక్‌కు ఎన్ని ఇళ్లు వస్తాయో..అంతమంది మాత్రమే తొలుత ఖాళీచేస్తారని, ఇళ్ల నిర్మాణం పూర్తయి వారు కొత్త ఇళ్లలో చేరాక మిగతా బ్లాక్‌లోని లబ్ధిదారులు ఖాళీ చేస్తామని వారు భీష్మించుకున్నారు. అంతేకాకుండా పొజిషన్ సర్టిఫికెట్లకు సంబంధించి అందరి పేర్లు ఒకే జాబితాగా పేర్కొని, వాటినే జిరాక్సులుగా ఇచ్చారని, అలా కాకుండా ఎవరి పేరు మీద వారికి విడివిడిగా పొజిషన్లు అందజేయాలని డిమాండ్ చేస్తున్నారు. పొజిషన్ సర్టిఫికెట్లు వ్యక్తిగతంగా జారీ చేసేందుకు ఇబ్బంది లేకున్నా విడతల వారీగా నిర్మాణం కుదరంటున్నారు అధికారులు. ఐదంతస్తుల్లో నిర్మించాల్సిన వీటిని విడతల వారీగా నిర్మిస్తే సిమెంటు, ఇనుము తదితర ధరల్లో తేడా వస్తుందని, ఏవిధంగా చూసినా సాధ్యం కాదంటున్నారు. ఇక వారిని ఒప్పించేందుకు మునిసిపల్‌మంత్రి కేటీఆర్‌తో తగిన హామీ ఇప్పించాలని భావిస్తున్నారు. ఖాళీ స్థలంలో నిర్మించాలి.. కార్వాన్ నియోజకవర్గంలోని అమ్లాపూర్ జోషివాడలో జీ ప్లస్ 3 అంతస్తుల్లో 400 ఇళ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. అందుకు మున్సిపల్ క్వార్టర్లలోని ప్రజలు ససేమిరా అంటున్నారు. నిర్ణీత వ్యవధిలో అధికారులు నిర్మిస్తారన్న నమ్మకం తమకు లేదని, ఉంటున్న ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేయబోమంటున్నారు. పక్కనే ఉన్న ఖాలీస్థలంలో నిర్మించాలని డిమాండ్చేస్తున్నారు. ఇప్పటికే తమలో 235 మంది ఇళ్ల పట్టాలున్నాయని, తాముంటున్న ఇళ్లను ఖాళీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. కొందరు ఔనంటూ.. కొందరు కాదంటూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఆర్కే నగర్లో జీ ప్లస్ 3 అంతస్తుల పద్ధతిలో 384 ఇళ్ల నిర్మాణానికి అధికారులు సిద్ధమయ్యారు. గుట్టమీద ఉంటున్న 150 మంది కావాలని, గుట్ట కింది భాగంలో ఉన్న దాదాపు 125 మంది వద్దని విభేదాలు తలెత్తడంతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు ఎవరి వారుగా తమ పంతం నెగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుండటం కూడా ఇక్కడ సమస్య కొలిక్కి రాకపోవడానికి ఒక కారణంగా స్థానికులు చెబుతున్నారు. ఇలా.. ఇన్‌సిటు విధానంలో నిర్మించే ఇళ్లకు ఆటంకాలు ఎదురవుతుండటంతో గ్రేటర్లో డబుల్ ఇళ్ల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు చందంగా మారింది. -
ఐపీఎల్ టెండర్ల ప్రక్రియ నిలిపివేత
న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్ల ప్రక్రియను బీసీసీఐ నిరవధికంగా వారుుదావేసింది. షెడ్యూల్ ప్రకారం నేడు (మంగళవారం) టెండర్ల దాఖలుకు చివరి గడువు తేదీ. అరుుతే ఈ ప్రక్రియను పరిశీలించేందుకు జస్టిస్ ఆర్ఎం లోధా ప్యానెల్ తమ స్వతంత్ర ఆడిటర్‌ను నియమించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డుకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలైనా లోధా ప్యానెల్ నియమించే ఆడిటర్ పర్యవేక్షణలోనే జరగాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్ల వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిగా బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే.. ప్యానెల్‌కు లేఖ రాశారు. ‘పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టెండర్ ప్రక్రియ కొనసాగాలని మేం కమిటీకి సమాచారమిచ్చాం. విదేశాల నుంచి బిడ్డర్లు భారత్‌కు వస్తారని కూడా తెలిపాం. అరుుతే ఆడిటర్ నియామకం గురించి కమిటీ నుంచి మాకు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో టెండర్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రొఫెషనల్‌గా నిర్వహించే అవకాశం లేకుండా పోరుుంది. అందుకే వారుుదా నిర్ణయం తీసుకున్నాం. కమిటీ నుంచి స్పందన వచ్చాక అందరికీ తెలియజేస్తాం’ అని బీసీసీఐ వెల్లడించింది. బిడ్‌స దాఖలు చేసిన కంపెనీలకు కృతజ్ఞతలు తెలుపుతూ తాజా పరిస్థితికి బీసీసీఐ క్షమాపణలు తెలిపింది. -
‘పాలమూరు’కు టెండర్లు పిలవండి
* అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం * రెండు వారాల్లో పనులు మొదలుపెట్టాలి * మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన * పాలమూరు, పెన్‌గంగ, డిండి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై తలపెట్టిన ప్రాజెక్టుల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకొని పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. పాల మూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు వెంటనే టెండర్లు పిలవాలని, రెండు వారాల్లో టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో వేగం పెంచడానికి , త్వరితగతిన నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా చీఫ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ స్థాయి అధికారులకు కూడా అధికారాలు బదలాయించాలని ఆదేశాలు జారీ చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి టి.హరీశ్‌రావు, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, శాఖ కార్యదర్శి ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్, సీఈ హరిరామ్, రిటైర్డ్ ఇంజనీర్లు రంగారెడ్డి, శ్యాంప్రసాద్‌రెడ్డి, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే పాల్గొన్నారు. వచ్చే ఏడాదిలో కాళేశ్వరానికి నీరు చేరాలి వచ్చే బడ్జెట్లో నీటి పారుదల శాఖకు కేటాయించే రూ.25 వేల కోట్ల నిధుల్లో ప్రతినెలా రూ.2,083 కోట్లు విడుదల చేస్తామని, అందు కు అనుగుణంగా పనులు జరగాలని సీఎం ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన రీడిజైన్లు పూర్తయినందున అన్ని ప్రాజెక్టుల పనులు ప్రారంభం కావాలన్నారు. పాలమూరు పరిధిలోని ఏదుల, కరివెన డిస్ట్రిబ్యూటరీ పనులకు సత్వరమే టెం డర్లు పిలవాలన్నారు. ఉద్దండాపూర్‌కు పనుల డిజైన్లు ఖరారు చేయాలన్నారు. మేడిగడ్డ వద్ద కాళేశ్వరం బ్యారేజీకి త్వరలో శంకుస్థాపన చేయాలని, వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ బ్యారేజీ నుంచి ఎల్లంపల్లి నీరు చేరేలా పనులు జరగాలన్నారు. పెన్‌గంగ ప్రాజెక్టు టెండర్లను సైతం రెండు వారాల్లో పూర్తి చేయాలని, డిండి ప్రాజెక్టుకు కూడా త్వరగా టెండర్లు పిలవాలని సూచించారు. రూ.27వేల కోట్ల పనులు..18 ప్యాకేజీలు మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 62 మండలాల్లో 1,131 గ్రామాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును రూ.35,200 కోట్లతో చేపట్టిన విషయం తెలిసిందే. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు... నార్లాపూర్-8.1 టీఎంసీ, ఏదుల 6.5, వట్టెం 16.6, కరివెన 19.15, ఉద్ధండాపూర్ 92 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించాలని నిర్ణయించారు. వీటి కోసం మొత్తంగా రూ.9,644 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. ఇందులో వట్టెం రిజర్వాయర్‌కు గరిష్టంగా 3,780 కోట్లు కానుండగా, కరివెనకు రూ.2,490 కోట్లు, ఉద్ధండాపూర్కు రూ.2,115 కోట్లు, నార్లాపూర్‌కు రూ.801 కోట్లు, ఏదులకు రూ.458 కోట్లు అంచనా వ్యయంగా లెక్కించారు. వీటితో పాటు నార్లపూర్ నుంచి ఉద్ధండాపూర్ వరకు కాలువలు, టన్నెల్ల నిర్మాణానికి సంబంధించి మొత్తం పనులను రూ.20,654.54 కోట్లుగా లెక్కగట్టగా... ఎలక్ట్రో మెకానికల్ పనులకు అదనంగా మరో రూ.6,258.72 కోట్లు ఖర్చవుతుందని అంచనాలు సిద్ధం చేశారు. మొత్తంగా రూ.26,913.26 కోట్ల పనులను 18 ప్యాకేజీలుగా విభజించారు. ఇందులో గరిష్టంగా ప్యాకేజీ-18లో రూ.2,169.94 కోట్ల పనులు ఉండగా, కనిష్టంగా ప్యాకేజీ-3లో రూ.427 కోట్ల పనులున్నాయి. అయితే ఈ ప్యాకేజీల విషయంలో నెలకొన్న సందిగ్ధత కారణంగా టెండర్ల ప్రక్రియ ఆగిపోయింది. రూ.500 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్ల మధ్య టెండర్లు పిలవాలని అధికారుల స్థాయిలో నిర్ణయం జరగ్గా... మొబిలైజేషన్ అడ్వాన్సులు లేనందున ప్యాకేజీలను రూ.వెయ్యి కోట్లకు పైనే నిర్ణయించి పెద్ద కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచనలు చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో ఈ విషయం చర్చకు రాగా సీఎం... నిర్ణయాధికారాన్ని అధికారులకే కట్టబెట్టారు. ఇప్పటికే విభజించిన ప్యాకేజీలకు అనుగుణంగా టెండర్లు పిలవాలని సూచించారు. ఇక సివిల్, ఎలక్ట్రోమెకానికల్ పనులను విభజించాలన్న సూచనను పక్కనపెట్టి.. అన్ని పనులకు ఒకే టెండర్ పిలవాలని నిర్ణయించారు. డిండికి లైన్‌క్లియర్... మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు సాగునీరందించేందుకు ఉద్దేశించిన డిండి ప్రాజెక్టు డిజైన్‌కు సమావేశంలో ఓకే చేశారు. ఎలాంటి టన్నెల్ల నిర్మాణం లేకుండా కాలువల ద్వారా నీటిని అందించే ప్రణాళికకు ఆమోదం లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండే ఏదుల రిజర్వాయర్ అప్పర్ డిండికి నీటిని తరలించే బదులు 430 మీటర్ల ఎత్తు వద్దే రిజర్వాయర్ నిర్మించి అక్కడ్నుంచి నీటిని తరలించేలా డిజైన్‌ను ఖరారు చేశారు. ఇలా అయితే టన్నెల్ అవసరం ఉండదని ఇంజనీర్లు చెబుతున్నారు. 430 మీటర్ల ఎత్తు వద్ద రిజర్వాయర్ నిర్మాణం చేపడితే కొత్తగా ఇర్విన్ వద్ద 4.5 టీఎంసీలు, జేపల్లి వద్ద ఒక టీఎంసీ సామర్థ్యం రిజర్వాయర్ నిర్మించా ల్సి ఉంటుంది. అలాగే కిష్టరాంపల్లి సామర్థ్యం 5.7 నుంచి 9 టీఎంసీలు, శివన్నగూడెం సామర్థ్యాన్ని 7 నుంచి 10 టీఎంసీలకు పెంచాల్సి ఉంటుంది. -
3 దశలుగా ‘గ్రిడ్’ టెండర్లు
తాజాగా ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్: తెలంగాణ తాగునీటి సరఫరా పథకం (వాటర్‌గ్రిడ్) టెండ ర్ల ప్రక్రియను మొత్తం మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. మొత్తం 26 ప్యాకేజీలకుగానూ తొలి దశ పనుల (11ప్యాకేజీల)కు గత నెల 23న నోటిఫికేషన్ జారీ చే యగా మిగిలిన విడతల టెండర్ల ప్రక్రియ (15ప్యాకేజీ)లకు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది. 2015-16కుగాను స్టాండర్డ్ షెడ్యూలు రేట్లు మారడంతో తొలి విడత టెండర్ల షెడ్యూలును గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) సవరించి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత షెడ్యూలు ప్రకారం గత నెల 27 నుంచి టెండర్లు స్వీకరించాల్సి ఉండగా కొత్త ఎస్ఎస్ఆర్ రేట్ల కారణంగా ఆ ప్రక్రియను అధికారులు అర్ధంతరంగా నిలిపేశారు. తాజా షెడ్యూలు మేరకు ఈ నెల 7 నుంచి 21 వరకు ఆన్లైన్లో టెండరు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే 22న టెక్నికల్ బిడ్లను, 25న ఫైనాన్షియల్ బిడ్లను పరిశీలిస్తామని, ఈ నెలాఖరులోగా టెండర్లను ఖరారయ్యే అవకాశం ఉందన్నారు. ప్యాకేజీల్లో స్వల్ప మార్పులు... వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 34,568 కోట్లుగా నిర్ధారించిన అధికారులు ఈనెల 23న తొలి దశ కింద 11 ప్యాకేజీలకుగానూ రూ.15,987 కోట్ల విలువైన పనులకు నోటిఫికేషన్ ఇచ్చారు. టెండర్లు స్వీకరించేలోగా ఎస్ఎస్ఆర్ రేట్లు మారడంతో ఆయా ప్యాకేజీల అంచనాలను మార్చాల్సి వచ్చింది. మారిన రేట్లతో ప్రాజెక్ట్ వ్యయం రూ. 100 కోట్లు తగ్గినట్లు (రూ. 15,887 కోట్లే) అధికారులు ప్రకటించారు. గతంలో కంటే ఇనుము ధర బాగా తగ్గడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. కొన్ని ప్యాకేజీలకు సంబంధించి అంచనాలు యథాతథంగా ఉన్నాయని తెలిపారు. స్టీల్ ధర తగ్గినదానికి, ఇతర సామాగ్రి ధర పెరిగినదానికి సరిపోయిందని ముఖ్య అధికారి ఒకరు తె లిపారు. సీఎం సొంత జిల్లాలోని ప్యాకేజీ (మెదక్-గజ్వేల్)కి గతంలో రూ. 700 కోట్లతో అంచనాలు వేసిన అధికారులు ఆ ప్యాకేజీని తాజాగా రూ. 600 కోట్లకు కుదించారు. 11 ప్యాకేజీలు, వాటి అంచనా వ్యయాలు ప్యాకేజీ పేరు వ్యయం(రూ.కోట్లలో) మహబూబ్‌నగర్-శ్రీశైలం 5,953.00 మెదక్-జూరాల 700.00 రంగారెడ్డి- మేడ్చల్ 160.00 నల్లగొండ-ఏకేబీఆర్ 2,106.00 నల్లగొండ- ఎన్ఎస్పీ/టెయిల్‌పాండ్ 1,485.00 మెదక్-సంగారెడ్డి 680.00 మెదక్- గజ్వేల్ 600.00 అదిలాబాద్-ఎల్లంపల్లి-కడెం 670.00 వరంగల్-పాలేరు 1,700.00 వరంగల్-హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ 840.00 ఖమ్మం-పాలేరు 993.00 మొత్తం 15,887.00 -
టెండర్లు ప్రహసనమేనా?
- పూర్తికాని నాచుపల్లి జేఎన్టీయూ హాస్టళ్ల టెండర్లు - పాతవారికి కట్టజెప్పేందుకు అధికారుల యత్నాలు - అన్నీ అవకతవకలే : టెండర్‌దారులు కొడిమ్యాల : నాచుపల్లి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలోని హాస్టళ్ల నిర్వహణకు చేపట్టిన టెండర్ల ప్రక్రియ అంతా ప్రహసనంగానే కనిపిస్తుంది. పాతవారికే అప్పగించేందుకు కళాశాల అధికారులు కుట్రలు చేస్తున్నారని టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. అధికారుల వైఖరి సైతం వీరి ఆరోపణలకు బలం చూకూరుస్తున్నారుు. 2015-16 విద్యాసంవత్సరానికి బాలురు, బాలికల హాస్టళ్లు, క్యాంటీన్ల నిర్వహణకు గతనెల 27న టెండర్లు ఆహ్వానించారు. బాయ్స్‌హాస్టల్‌కు 10, గర్ల్స్‌హాస్టల్‌కు 10, క్యాంటీన్‌కు 3 టెండర్లు దాఖలయ్యా యి. నిబంధనల ప్రకారం తక్కువ కోట్‌చేసిన వారికి టెండర్ ఖరారు చేయాలి. టెండర్లలో పాల్గొనదలిచిన వారు 14 రకాల డాక్యుమెంట్లు సమర్పించాలి. పరిశీలన సమయంలో అధికారులు ముందుగా టెక్నికల్ బిడ్‌ను ఓపెన్ చేసి అన్ని సరిగ్గా ఉన్న వాటినే అనుమతించాలి. కానీ ఇక్కడి అధికారులు మాత్రం ఫైనాన్షియల్ బిడ్‌ను మాత్రమే పరిశీలించారు. టెండర్దారులందరూ 14 రకాల డాక్యుమెంట్లు సమర్పించారో, లేదో పట్టించుకోలేదు. ఫైనాన్షియల్ బిడ్‌ను పరిశీలించిన అధికారులు తక్కువ కోట్ చేసిన వారికే టెండర్ ఇస్తున్నట్లు ప్రకటించనూ లేదు. దీంతో వీరి వైఖరిపై పలు అనుమానాలు కలుగుతున్నారుు. పాతవారికి ఇప్పించేందుకే ఆలస్యమా? బాయ్స్‌హాస్టల్ నిర్వహణ బాధ్యతలు మారుతున్నప్పటికీ, ఏడేళ్లుగా గర్ల్స్‌హాస్టల్ నిర్వహణ ను వివిధ సంస్థల పేరుతో ఒకే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఈసారి కూడా అతనికే అప్పగించేందుకు కళాశాల అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. గర్ల్స్‌హాస్టల్‌కు అత్యల్పంగా ఆంజనేయ ఫర్మ్ తరఫున ఒక్క విద్యార్థినికి రూ.44.89 చొప్పున, బాయ్స్‌హాస్టల్‌కు అత్యల్పంగా సరోజ ఫర్మ్ తరఫున ఒక్క విద్యార్థికి రూ.55 చొప్పున టెండర్లు వచ్చాయి. తమకు అనుకూలమైన వ్యక్తి వీటికన్నా ఎక్కువ మొత్తాన్ని కోట్ చేయడంతో అతనికే టెండర్దక్కేలా చేసేందుకు అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని మిగతా టెండర్‌దారులు ఆరోపిస్తున్నారు. గతేడాది కూడా బాయ్స్‌హాస్టల్ టెండర్ పొందిన వ్యక్తికి గర్ల్స్‌హాస్టల్ నిర్వహణ బాధ్యతలు, గర్ల్స్‌హాస్టల్ టెండర్లు పొందిన వ్యక్తికి బాయ్స్‌హాస్టల్ బాధ్యతలు అప్పగించారు. విద్యార్థుల అభిప్రాయంపై అనుమానాలు టెండర్దారులకున్న అర్హతలను విద్యార్థుల సమక్షంలో చర్చించామని, బాయ్స్, గర్ల్స్‌హాస్టల్ రెండు టెండర్లనూ మణికంఠ ఏజన్సీకే ఇవ్వాలని విద్యార్థులు తీర్మానించారని ప్రిన్సిపాల్ ఎన్వీ రమణ తెలిపారు. అరుుతే మణికంఠ ఏజెన్సీ వారే గతేడాది గర్ల్స్హాస్టల్ను నిర్వహించారు. మిగతావారి కంటే అత్యధికంగా గర్ల్స్‌హాస్టల్‌కు రూ.50, బాయ్స్‌హాస్టల్‌కు రూ.62 కోట్‌చేశారు. వీరికి అనుకూలంగా వ్యవహరించేందుకే టెండర్ల వ్యవహారంలోకి విద్యార్థుల అభిప్రాయం అనే కొత్తసూత్రాన్ని అధికారులు తీసుకొచ్చారని మిగతా వారి నుంచి ఆరోపణలు వస్తున్నారుు. కళాశాల అధికారులు మాటల్లో చెబుతున్న పారదర్శకతను ఆచరణలో చూపించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. టెండర్ ఖరారు గురించి ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తే దాటవేస్తున్నాడని, యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని కొందరు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మరికొందరు పేర్కొంటున్నారు. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా విద్యార్థులే మెస్ బిల్లు చెల్లిస్తున్నందున.. వారిని టెండర్ల ప్రక్రియలో ఇన్వాల్వ్ చేశామన్నారు. రెండురోజుల్లో యూనివర్సిటీ ఉన్నతాధికారుల వద్దకు టెండర్ ఫారాలు తీసుకెళ్లి ఫైనల్ చేస్తామని తెలిపారు. -
‘క్లీన్ ఆఫ్ మార్షల్స్’ పునఃప్రారంభం
♦ నిర్ణయం తీసుకున్న బీఎంసీ ♦ టెండర్ల ప్రక్రియ ప్రారంభం సాక్షి, ముంబై : కొన్ని నెలల కిందట రదు ్ద చేసిన ‘క్లీన్ ఆఫ్ మార్షల్స్’ పథకాన్ని పునఃప్రారంభించాలృ బహన్‌ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇందుకోసం టెండర్లు ఆహ్వానించే ప్రక్రియ ప్రారంభించింది. అయితే ముందు జాగ్రత+్త చర్యగా క్లీన్ ఆఫ్ మార్షల్స్‌కు అప్పగించిన కొన్ని అధికారాలను తగ్గించాలని నిర్ణయించింది. రోడ్లు, ఫూట్పాత్లు, బహిరంగ ప్రదేశాల్లో మలమూత్రాలు విసర్జించడం, బట్టలు ఉతకడం, వాహనాలు శుభ్రం చేయడం, ఉమ్మివేయడం, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయడం వంటి పరిసరాలను అశుభ్రపరిచే చర్యలకు పాల్పడే వారికి శిక్ష విధించేందుకు 2007లో క్లీన్ ఆఫ్ మార్షల్స్ పథకాన్ని బీఎంసీ ప్రారంభించింది. ఇందుకోసం ప్రైవేటు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఒక్కో వార్డుకు 11 మంది చొప్పున మార్షల్స్‌ను నియమించింది. ప్రారంభంలో అంతా సవ్యంగానే సాగినా, రానురాను ఈ అధికారాలను కొందరు దుర్వినియోగం చేయడం మొదలుపెట్టారు. షాపులు, క్లినిక్‌లు, హాకర్స్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడడం, జరిమానా పేరుతో ప్రజల నుంచి డబ్బు గుంజుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో బీఎంసీ ఈ పథకాన్ని రెండేళ్లకే అటకెక్కించింది. తరువాత రెండుసార్లు పునఃప్రారంభించినా మళ్లీ రద్దు చేసింది. కాని ఈ సారి పకడ్బంధీగా మార్షల్స్ నియామక ప్రక్రియ నిర్వహించాలని నిర్ణయించింది. అందుకు కొత్త కంపెనీకి కాంట్రాక్టు బాధ్యతలు అప్పగించే ప్రయత్నాలు చేస్తోంది. -
డబ్బే డబ్బు
- ఏడాదికి మద్యం ద్వారా రూ.155 కోట్ల ఆదాయం - షాపుల లెసైన్స్ ఫీజు ద్వారా రూ.107 కోట్లు - దరఖాస్తు ఫీజు ద్వారా రూ.35 కోట్లు - ప్రభుత్వం ఏర్పాటు చేసే షాపుల నుంచి రూ.13 కోట్లు - ప్రభుత్వ షాపుల్లో అమ్మకాలతో వచ్చేది అదనం - ఆగిపోయిన పది షాపులకు త్వరలో నోటిఫికేషన్ - అవి కూడా వస్తే మరింత ఆదాయం ఒంగోలు క్రైం: జిల్లాలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం షాపులపై వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది. ఆదాయమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన మద్యం పాలసీ మేరకు జిల్లాలో సోమవారం ఉదయానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఆదివారం రాత్రి ప్రారంభించిన టెండర్ల కార్యక్రమం సోమవారం ఉదయం 8 గంటల వరకు సాగింది. జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఒకేసారి టెండర్ల విధానాన్ని ప్రారంభించటంతో త్వరగా పూర్తయ్యాయి. లేకుంటే సోమవారం మధ్యాహ్నం వరకు కొనసాగేది. జిల్లాలో మొత్తం 289 మద్యం షాపులకుగాను 279 షాపులకు దరఖాస్తులు వచ్చాయి. మొత్తం మీద కేవలం 10 షాపులకు దరఖాస్తులు అసలు పడనేలేదు. అయితే టెండర్లు తీసి షాపుల కేటాయింపులు జరిగిన వరకు ఏడాదికి మద్యం షాపుల లెసైన్స్ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రూ.107 కోట్ల ఆదాయం రానుంది. ఈ మొత్తాన్ని లెసైన్స్‌దారులు ఆరు నెలల్లోపు షాపులకు కేటాయించిన లెసైన్స్ ఫీజును విడతల వారీగా ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే దరఖాస్తుల అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.35 కోట్లు జమ అయింది. ఇకపోతే జిల్లాలో ప్రభుత్వం తరఫున మొత్తం 32 మద్యం షాపులు నిర్వహించాల్సి ఉంది. ఇవి ఒంగోలు ఈఎస్ పరిధిలో 15, మార్కాపురం ఈఎస్ పరిధిలో 17 ఉన్నాయి. వీటన్నింటికి సాధారణంగా ప్రభుత్వం కేటాయించిన లెసైన్స్ ఫీజు ప్రకారం లెక్కలేస్తే మొత్తం రూ.13 కోట్ల ఆదాయం రానుంది. లెసైన్స్ ఫీజు కాకుండా ఏడాది పొడవునా మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం అదనం అన్న మాట. అమ్మకాల ద్వారా అదనంగా మరో ఏడెనిమిది కోట్లు ఆదాయం రావచ్చని ఎక్సైజ్ అధికారులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తులు రాకుండా ఆగిపోయిన పది మద్యం షాపులకు త్వరలో ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఆగిపోయిన వాటిలో ఒంగోలు ఈఎస్ పరిధిలో 7 షాపులు, మార్కాపురం ఈఎస్ పరిధిలో 3 షాపులు, చీరాల పరిధిలో ఆరు షాపులు ఉన్నాయి. వీటితో పాటు సింగరాయకొండ, జరుగుమల్లి మండలం చిర్రికూరపాడు, కనిగిరి మండలం పెదఅలవలపాడు, పర్చూరు మండలం నూతలపాడులో షాపులకు దరఖాస్తులు రాలేదు. వీటికి కొత్తగా దరఖాస్తులు వస్తే తిరిగి ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరుగుతుంది. -
పెత్తనం కాంట్రాక్టర్లదే
రెండు కార్పొరేషన్లలో అధికారులు, పాలకవర్గ సభ్యులతో కుమ్మక్కు రెండు నెలలుగా వేతనాల్లేక కార్మికుల ఇబ్బందులు ఏకపక్షంగా టెండర్ల ప్రక్రియ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని రెండు కార్పొరేషన్లలో కాంట్రాక్టర్ల హవానే కొనసాగుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో తొమ్మిదేళ్లుగా ఒకే గ్రూపు శానిటేషన్ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. రామగుండం నగరపాలక సంస్థలోనూ దాదాపు ఇదే తంతు కొనసాగుతోంది. ఇక్కడా కొందరు కాంట్రాక్టర్లదే పెత్తనం నడుస్తోంది. నగర పాలక సంస్థకు చెందిన కొందరు పాలక వర్గ సభ్యులు, అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు సకాలంలో వేతనాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత రెండు నెలలుగా ఆయా ఉద్యోగులకు వేతనాలివ్వకపోవడమే ఇందుకు నిదర్శనం. పీఎఫ్, ఈఎస్ఐ చెల్లింపుల్లోనూ ఇదే తంతు ! బ్యాంకుల ద్వారానే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో హడావుడిగా కార్మికులందరికి బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి కొద్దికాలంపాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించినప్పటికీ మూడేళ్లుగా ఈ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో వేతనాల చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు పీఎఫ్, ఈఎస్ఐ ప్రీమియం మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఫలితంగా కార్మికులు వైద్య సేవలను సైతం పొందలేని దుస్థితి నెలకొంది. అంతా ఏకపక్షమే..! రామగుండం నగర పాలక సంస్థలో టెండర్ల ప్రక్రియ పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో టెండర్ల ప్రక్రియ లేకుండానే కాంట్రాక్టర్లకు ఔట్సోర్సింగ్ కార్మికుల కొనసాగింపు పనులను అప్పగించారు. కార్పొరేషన్లో ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు... ఎంత మంది గైర్హాజరయ్యారనే వివరాలు సైతం బహిర్గతం కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు జాగ్రత్తపడ్డారు. కార్పొరేషన్లో మొత్తం 485 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కాగా, వీరిలో 361 మంది పారిశుధ్య కార్మికులున్నారు. రోజుకు సగటున 50 కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నప్పటికీ వారంతా హాజరైనట్లుగా రికార్డుల్లో చూపుతూ ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లు, అధికారులు, కొందరు పాలకవర్గ సభ్యులు పంచుకు తింటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కాంట్రాక్టు ముగియడంతో గత నెల 23న ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా 10 పనులకు రూ.317.15 లక్షల వ్యయం అంచనాలతో టెండర్లు నిర్వహించారు. పరిపాలనా కారణాలతో ఈ టెండర్లను వాయి దా వేసిన నగర పాలక సంస్థ కమిషనర్ మల్లిఖార్జునుడు ఈ-ప్రొక్యూర్మెంట్ ద్వారా తాజాగా టెండర్లను ఆహ్వానించగా, పలు కాంట్రాక్టు సం స్థలు అందులో పాల్గొన్నాయి. షెడ్యూల్ ప్రకా రం ఈనెల 14న టెండర్లను తెరవాల్సి ఉండగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన శానిటేషన్ టెండర్లలో జరిగిన అవకతవకలు ఇటీవల వెలుగుచూడడంతో రామగుం డం కార్పొరేషన్ అధికారుల్లోనూ వణుకు మొదలైంది. తాత్కాలికంగా టెండర్లు తెరిచే ప్రక్రియను వాయిదా వేసిన అధికారులు గత పక్షం రోజులుగా టెండర్ల షెడ్యూళ్లను పరిశీలించే పనుల్లో నిమగ్నమవడం గమనార్హం.