పెత్తనం కాంట్రాక్టర్లదే | Authority contractors | Sakshi
Sakshi News home page

పెత్తనం కాంట్రాక్టర్లదే

Published Mon, Nov 10 2014 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

Authority contractors

  • రెండు కార్పొరేషన్లలో అధికారులు, పాలకవర్గ సభ్యులతో కుమ్మక్కు
  • రెండు నెలలుగా వేతనాల్లేక కార్మికుల ఇబ్బందులు
  • ఏకపక్షంగా టెండర్ల ప్రక్రియ
  • సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : జిల్లాలోని రెండు కార్పొరేషన్లలో కాంట్రాక్టర్ల హవానే కొనసాగుతోంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో తొమ్మిదేళ్లుగా ఒకే గ్రూపు శానిటేషన్ పనులు చేపడుతున్న విషయం తెలిసిందే. రామగుండం నగరపాలక సంస్థలోనూ దాదాపు ఇదే తంతు కొనసాగుతోంది. ఇక్కడా కొందరు కాంట్రాక్టర్లదే పెత్తనం నడుస్తోంది. నగర పాలక సంస్థకు చెందిన కొందరు పాలక వర్గ సభ్యులు, అధికారుల సహకారంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు సకాలంలో వేతనాలివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. గత రెండు నెలలుగా ఆయా ఉద్యోగులకు వేతనాలివ్వకపోవడమే ఇందుకు నిదర్శనం.
     
    పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపుల్లోనూ ఇదే తంతు !

    బ్యాంకుల ద్వారానే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అప్పట్లో హడావుడిగా కార్మికులందరికి బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి కొద్దికాలంపాటు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించినప్పటికీ మూడేళ్లుగా ఈ ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేశారు. దీంతో వేతనాల చెల్లింపుల విషయంలో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చివరకు పీఎఫ్, ఈఎస్‌ఐ ప్రీమియం మొత్తాన్ని కూడా సకాలంలో చెల్లించడం లేదు. ఫలితంగా కార్మికులు వైద్య సేవలను సైతం పొందలేని దుస్థితి నెలకొంది.
     
    అంతా ఏకపక్షమే..!


    రామగుండం నగర పాలక సంస్థలో టెండర్ల ప్రక్రియ పూర్తిగా ఏకపక్షంగా సాగుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో టెండర్ల ప్రక్రియ లేకుండానే కాంట్రాక్టర్లకు ఔట్‌సోర్సింగ్ కార్మికుల కొనసాగింపు పనులను అప్పగించారు. కార్పొరేషన్లో ఎంత మంది కార్మికులు పనిచేస్తున్నారు... ఎంత మంది గైర్హాజరయ్యారనే వివరాలు సైతం బహిర్గతం కాకుండా అధికారులు, కాంట్రాక్టర్లు జాగ్రత్తపడ్డారు. కార్పొరేషన్లో మొత్తం 485 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కాగా, వీరిలో 361 మంది పారిశుధ్య కార్మికులున్నారు.

    రోజుకు సగటున 50 కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నప్పటికీ వారంతా హాజరైనట్లుగా రికార్డుల్లో చూపుతూ ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లు, అధికారులు, కొందరు పాలకవర్గ సభ్యులు పంచుకు తింటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇటీవల కాంట్రాక్టు ముగియడంతో గత నెల 23న ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా 10 పనులకు రూ.317.15 లక్షల వ్యయం అంచనాలతో టెండర్లు నిర్వహించారు. పరిపాలనా కారణాలతో ఈ టెండర్లను వాయి దా వేసిన నగర పాలక సంస్థ కమిషనర్ మల్లిఖార్జునుడు ఈ-ప్రొక్యూర్‌మెంట్ ద్వారా తాజాగా టెండర్లను ఆహ్వానించగా, పలు కాంట్రాక్టు సం స్థలు అందులో పాల్గొన్నాయి.

    షెడ్యూల్ ప్రకా రం ఈనెల 14న టెండర్లను తెరవాల్సి ఉండగా, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన శానిటేషన్ టెండర్లలో జరిగిన అవకతవకలు ఇటీవల వెలుగుచూడడంతో రామగుం డం కార్పొరేషన్ అధికారుల్లోనూ వణుకు మొదలైంది. తాత్కాలికంగా టెండర్లు తెరిచే ప్రక్రియను వాయిదా వేసిన అధికారులు గత పక్షం రోజులుగా  టెండర్ల షెడ్యూళ్లను పరిశీలించే పనుల్లో  నిమగ్నమవడం గమనార్హం.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement