ఐపీఎల్ టెండర్ల ప్రక్రియ నిలిపివేత
న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్ల ప్రక్రియను బీసీసీఐ నిరవధికంగా వారుుదావేసింది. షెడ్యూల్ ప్రకారం నేడు (మంగళవారం) టెండర్ల దాఖలుకు చివరి గడువు తేదీ. అరుుతే ఈ ప్రక్రియను పరిశీలించేందుకు జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ తమ స్వతంత్ర ఆడిటర్‌ను నియమించకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బోర్డుకు సంబంధించిన ఎలాంటి ఆర్థిక కార్యకలాపాలైనా లోధా ప్యానెల్ నియమించే ఆడిటర్ పర్యవేక్షణలోనే జరగాలని ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఐపీఎల్ మీడియా హక్కుల టెండర్ల వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలో సూచించాల్సిందిగా బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే.. ప్యానెల్‌కు లేఖ రాశారు. ‘పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టెండర్ ప్రక్రియ కొనసాగాలని మేం కమిటీకి సమాచారమిచ్చాం.
విదేశాల నుంచి బిడ్డర్లు భారత్‌కు వస్తారని కూడా తెలిపాం. అరుుతే ఆడిటర్ నియామకం గురించి కమిటీ నుంచి మాకు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం రాలేదు. దీంతో టెండర్ ప్రక్రియను పారదర్శకంగా, ప్రొఫెషనల్‌గా నిర్వహించే అవకాశం లేకుండా పోరుుంది. అందుకే వారుుదా నిర్ణయం తీసుకున్నాం. కమిటీ నుంచి స్పందన వచ్చాక అందరికీ తెలియజేస్తాం’ అని బీసీసీఐ వెల్లడించింది. బిడ్‌స దాఖలు చేసిన కంపెనీలకు కృతజ్ఞతలు తెలుపుతూ తాజా పరిస్థితికి బీసీసీఐ క్షమాపణలు తెలిపింది.