
కట్టడాల తొలగింపులో ఆందోళన
నగరంలో అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో హిందువులకు అన్యాయం జరిగిందని...
- రాయచూరులో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ
- కట్టడాల తొలగింపునకు సహకరించాలి-కలెక్టర్
రాయచూరు రూరల్ : నగరంలో అక్రమ కట్టడాల తొలగింపు విషయంలో హిందువులకు అన్యాయం జరిగిందని హిందూ హిత రక్షణ వేదిక కార్యకర్తలు ఆందోళన చేపట్టడంతో పోలీసులు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. శనివారం నగరంలోని నేతాజీ నగర్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు హిందువుల దేవాలయాల కట్టడాల తొలగింపు సమయంలో ఘోరీలకు జిల్లాధికారి మినహాయింపు ఇవ్వడాన్ని హిందూ సంఘాల సమాఖ్య సంచాలకుడు శంకరప్ప ఖండించి మాట్లాడారు. కట్టడాల తొలగింపునకు సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మసీదు, దర్గా, కబరస్థాన్, ఘోరీ, చర్చి, దేవాలయాలు అడ్డు రాకుండా తొలగించాలని ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.
ప్రస్తుతం నేతాజీ నగర్ వద్ద బయటపడ్డ ఘోరీ విషయంలో దారి తప్పించ వద్దని, పనుల కొనసాగింపునకు జిల్లాధికారి సహకరించాలన్నారు. ధర్మాల పేరుతో అభివృద్ధి పనులకు అవకాశం కల్పించాలని కోరారు. రాయచూరు పురాతన కాలంలో వున్న దేవాలయాలను తొలగించి మసీదులకు అవకాశం కల్పించడం తగదన్నారు. నగరంలోఎక్కడ తవ్వినా ఘోరీలు లభిస్తాయని, ఈ విషయంలో జిల్లాధికారి నిర్ణయం తీసుకుంటారని, ఎలాంటి అహింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా శాంతిగా వుండాలని కోరారు. కర్ణాటక సంఘం నుంచి ప్రారంభమైన ర్యాలీ స్వామి వివేకానంద వృత్తం వద్ద ఆందోళన చేపడుతున్న కార్యకర్తలు నేతాజీ నగర్ మీదుగా వెళ్లేందుకు కార్యకర్తలు ముందుకు వెళ్లడంతో పోలీసులు అడ్డుపడటంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
అనంతరం జిల్లాధికారి శశికాంత్ సింథల్ మాట్లాడుతు కట్టడాల తొలగింపులో రెండు వైపుల 22.5 అడుగుల దూరం పనులకు అవకాశం కల్పిస్తామని, అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఈసందర్భంగా రాయచూరు రూరల్ శాసన సభ్యుడు తిప్పరాజు, బీజేపీ అధ్యక్షుడు బసవనగౌడ, రమానంద, బండేష్, ప్రమోద్, సుదీప్, వెంకటరెడ్డి, నగరసభ సభ్యులు మహలింగ, గోవిందు, నరసప్ప, తిమ్మారెడ్డి, రాఘవేంద్ర, రమేశ్, శ్రీనివాస్, హిందూ జన జాగృతి కార్యకర్తలు తదితరులున్నారు.