
సాక్షి, అనంతపురం: కదిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బరి తెగింపు చర్యలకు పాల్పడ్డాడు. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను అడ్డుకుని కొడతానంటూ బెదిరించడమే కాక అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ వివరాలు.. మున్సిపల్ అధికారులు సోమవారం కదిరిలో కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు వరకు గల ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ చేశారు.
విషయం తెలుసుకున్న కందికుంట వెంటకప్రసాద్ అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారులను అడ్డుకున్నాడు. అంతటితో ఊరుకోక... ఆఫీస్‌కు వచ్చి కొడతానంటూ అధికారులను బెదిరించాడు. అధికారులపై అసభ్య పదజాలం వాడుతూ రెచ్చిపోయాడు. కందికుంట రౌడీయిజంపై స్థానికులు మండి పడుతున్నారు.