kandikunta venkataprasad
-
కందికుంట అడ్డంగా దొరికినా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీసత్యసాయి జిల్లా కదిరి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదు పట్టివేత వ్యవహారంలో పోలీసుల తీరు చర్చనీయాంశంగా మారింది. నగదు తరలింపులో కందికుంట పాత్రపై పక్కా ఆధారాలు లభ్యమైనప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే కేసును పక్కదోవ పట్టించి.. కందికుంటను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కందికుంట వెంకటప్రసాద్ కారులో సుమారు రూ.2 కోట్ల నగదును అనంతపురం నుంచి కదిరికి తరలిస్తుండగా.. నాలుగు రోజుల కిందట అనంతపురం విద్యుత్ నగర్ సర్కిల్లో పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. అది కందికుంట డబ్బేనని కారు డ్రైవర్ వాంగ్మూలం కూడా ఇచ్చారు. ఇదే కారుకు ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకున్నారు. ఇన్ని ఆధారాలున్నప్పటికీ కందికుంటపై చర్యలు తీసుకోవడానికి జాప్యమెందుకన్నది అంతుచిక్కని విషయం. ఈ కేసును నీరుగార్చేందుకు కుట్ర జరుగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో క్లిష్టమైన కేసులను ఇట్టే ఛేదించిన అనంతపురం పోలీసులు ఈ కేసు విషయంలో ఎందుకో దోబూచులాడుతున్నారు. కేసు నుంచి కందికుంటను తప్పించేందుకు ఏమైనా ప్లాన్ వేస్తున్నారా అన్న అనుమానాలు నెలకొన్నాయి. నాలుగు బైకులు పట్టుకుంటేనే హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టిమరీ వివరాలు వెల్లడించే పోలీసు అధికారులు.. సుమారు రూ.2 కోట్ల నగదు పట్టుబడిన విషయంలో మాత్రం ఎందుకు నాన్చుడు ధోరణి ప్రదర్శిస్తున్నారో అర్థం కావడంలేదు.రోజుకో మలుపు భారీస్థాయిలో నగదు పట్టుబడిన ఈ కేసు మలుపులు తిరుగుతోంది. దీనిపై కిందిస్థాయి పోలీసులు ముందుకెళ్లకుండా పైస్థాయి అధికారులు బంధనాలు వేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే కదిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిటరి్నంగ్ అధికారి (ఆర్వో)కి సమాచారం ఇచ్చామని పోలీసులు చెప్పారు. వాస్తవానికి వారు ఆర్వోకి సమాచారం ఇవ్వనేలేదు. కందికుంట ఎవరి ద్వారానైనా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారా? లేదా పోలీసులకే దీనిపై ‘ప్రత్యేక శ్రద్ధ’ ఉందా అన్నది తేలడం లేదు. అనంతపురం పోలీసు ఉన్నతాధికారుల వద్ద ఈ కేసు విషయంపై కిందిస్థాయి పోలీసులు చర్చించడానికి కూడా భయపడుతున్నట్టు తెలుస్తోంది. కందికుంట కారులో మూడు బ్యాగులు ఉన్నట్టు పలు టీవీ చానళ్ల విజువల్స్‌లో స్పష్టంగా కనిపిస్తుండగా, పోలీసులు మాత్రం రెండు బ్యాగులే ఉన్నట్లు చెబుతున్నారు. మూడో బ్యాగులోనూ డబ్బులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్లాయన్నది తేలాల్సి ఉంది. గతంలో హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారిపై భారీస్థాయిలో హవాలా నగదు పట్టుబడిన కేసులో రెండురోజుల్లోనే నిందితులను పట్టుకుని కోర్టులో హాజరుపరిచారు. అదే ఈ కేసులో మాత్రం ‘అనంత’ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. ఆర్వోకి సమాచారం ఇవ్వకుండానే ఇచ్చామని ఒక సీఐ చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.ఆర్వోకి సమాచారం ఇచ్చాం డబ్బుకు సంబంధించి విచారణ చేస్తున్నాం. ఇందులో ఉన్నది రెండు బ్యాగులే. ఒకవేళ ఉంటే మూడో బ్యాగు బట్టల బ్యాగ్ అయి ఉండొచ్చు. ఆర్వో దగ్గరకు మా అధికారులు వెళ్లారు. ఆర్వో నిర్ణయాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి. ఈలోగా మిగతా విచారణ జరుగుతూనే ఉంటుంది. – ఈ నెల 2వ తేదీన అనంతపురం టూటౌన్ సీఐ క్రాంతికుమార్‘సాక్షి’కి చెప్పిన వివరాలు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కందికుంట వెంకటప్రసాద్‌కు సంబంధించి సీజ్చేసిన రూ.2 కోట్ల కేసు వివరాలు ఇప్పటివరకు నాకు అందలేదు. నేను కదిరి ఆర్వోగా ఉన్నాను. కేసు అనంతపురంలో బుక్ చేశారు. అయినా నేను పోలీసులను అడిగాను. కానీ ఇప్పటివరకు వివరాలు ఇవ్వలేదు. పోలీసులు ఇచ్చే వివరాలను బట్టి మాత్రమే చర్యలు తీసుకోగలం. – ఈ నెల 3వ తేదీన కదిరి రిటరి్నంగ్ అధికారి సన్నీ వంశీకృష్ణ వెల్లడి -
ఆఫీస్‌కు వచ్చి కొడతాను: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట
సాక్షి, అనంతపురం: కదిరిలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ బరి తెగింపు చర్యలకు పాల్పడ్డాడు. ఆక్రమణలు తొలగించేందుకు వచ్చిన మున్సిపల్ అధికారులను అడ్డుకుని కొడతానంటూ బెదిరించడమే కాక అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ వివరాలు.. మున్సిపల్ అధికారులు సోమవారం కదిరిలో కాలేజ్ సర్కిల్ నుంచి కోనేరు వరకు గల ఆక్రమణల తొలగింపునకు మార్కింగ్ చేశారు. విషయం తెలుసుకున్న కందికుంట వెంటకప్రసాద్ అక్కడకు చేరుకుని మున్సిపల్ అధికారులను అడ్డుకున్నాడు. అంతటితో ఊరుకోక... ఆఫీస్‌కు వచ్చి కొడతానంటూ అధికారులను బెదిరించాడు. అధికారులపై అసభ్య పదజాలం వాడుతూ రెచ్చిపోయాడు. కందికుంట రౌడీయిజంపై స్థానికులు మండి పడుతున్నారు. -
కబ్జా పేరు వింటే కందికుంట గుర్తొస్తారు..!
సాక్షి, అనంతపురం (కదిరి): ఇతరుల ఆస్తిని కబ్జా చేయడం టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్‌కు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్ విమర్శించారు. ఆదివారం ఆయన తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కదిరిలో కబ్జా పేరు వింటే అందరికీ కందికుంట పేరు గుర్తుకు వస్తుందన్నారు. పట్టణంలో ఎంతో మంది క్రిíస్టియన్ అనాథ పిల్లలు చదువుకునే స్కూల్‌ను కందికుంట కబ్జా చేసి కూల్చేసిన విషయం కదిరి ప్రాంత ప్రజలందరికీ తెలుసన్నారు. గతంలో తాను హిందూపురంలో 8 ఎకరాల ఆస్తిని నిబంధనల ప్రకారమే క్రిస్టియన్ పెద్దల నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. అందులో 6 ఎకరాలను అప్పట్లోనే తాను సూచించిన వారి పేర్ల మీద రిజిష్టర్ కూడా చేయించారని వివరించారు. మిగిలిన రెండెకరాలు రిజిష్ట్రేషన్ చేయించడం ఆలస్యమైందని, ఆ భూమి విలువ పెరగడంతో రిజిష్ట్రేషన్ విలువ కూడా పెరిగిందన్నారు. అయితే ఆ భూమిని తాను కబ్జా చేసినట్లు ఇటీవల ఓ టీవీ చానల్లో ప్రసారం చేశారని, ఆ చానల్ యాజమాన్యంపై కోర్టులో పరువు నష్టం దావా వేయబోతున్నట్లు వివరించారు. చదవండి: (మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం) చంపుతామంటే బెదిరేవాన్ని కాదు.. తనను చంపుతానంటే భయపడే వ్యక్తిని కాదని కందికుంటకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ పరికి షామీర్ హెచ్చరించారు. బెదిరింపులతో కదిరి ప్రజలను భయపెట్టి రాజకీయం చేయాలని కందికుంట చూస్తున్నారని, ఈ సంస్కృతిని కదిరి ప్రజలు అంగీకరించరన్నారు. డబ్బు ఆశ చూపి కొందరు యువకులను కందికుంట తన వెంట తిప్పుకుంటూ పెడదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. త్యాగరాజుపై పలు కేసులున్నాయి తమపై తప్పుడు కేసు పెట్టిన త్యాగరాజుపై పలు ప్రాంతాల్లో కేసులు ఉన్నాయని షాకీర్, షామీర్ ఆరోపించారు. అందుకు సంబంధించిన ఆధారాలను వారు మీడియాముందుంచారు. సీఅండ్ఐజీ మిషన్ చర్చి చైర్మన్‌గా చెప్పుకుంటూ కందికుంటతో చేతులు కలిపిన త్యాగరాజు తప్పుడు పనులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. -
కదిరి టీడీపీ ఇన్చార్జ్ కందికుంటకు షాక్!
సాక్షి, అనంతపురం(కదిరి) : తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ పాపం పండింది. గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆయన చేసిన కబ్జాలు కోకోల్లలుగా ఉన్నాయి. ఇదే విషయాన్ని ఇటీవల వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసి గెలుపొందిన ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి తన ఎన్నికల ప్రచారంలో ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. తాను బాధితులకు అండగా నిలబడతానని బాధితులకు గట్టి భరోసా నిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితుల పక్షాన నిలిచి కందికుంట కబ్జా చేసిన 3 ఎకరాల స్థలాన్ని బాధితులకు దక్కేలా చేసి వారి మన్ననలు పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే...కదిరి–హిందూపురం రహదారిని ఆనుకొని వీవర్స్ కాలనీ వద్ద ముస్లింలకు చెందిన సర్వే నం.70–3లో ఉన్న 3.04 ఎకరాల స్థలాన్ని కందికుంట వెంకటప్రసాద్ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కబ్జా చేసి, తప్పుడు పత్రాలు సృష్టించి తన సమీప బంధువుల పేరుమీద రిజిష్ట్రర్ కూడా చేయించుకున్నాడు. ఆ భూమికి సంబందించిన వ్యక్తులు 2018 జూలై 14న చదును చేయడానికి వెళితే ఆ రోజు కందికుంట తన అనుచరుల ద్వారా వారిపై దాడి చేయించాడు. తర్వాత ఆ భూమిలోకి ఎవరూ ప్రవేశించకుండా చుట్టూ ప్రహరీ నిర్మించి ముందు వైపు పెద్ద గేట్ అమర్చి తాళం వేశాడు. బాధితుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే కందికుంట కబ్జా చేసిన స్థలం ఆ పేదలకే దక్కాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి బాధితుల పక్షాన రెవెన్యూ అధికారులను సంప్రదించి కదిరి ఆర్డీఓ కోర్టులో కేసు వేశారు. ఆర్డీఓ రికార్డులతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు, పట్టాదారు పాసుపుస్తకాలు పరిశీలించిన మీదట కందికుంటకు సమీప బంధువులైన దాసరి వెంకటేష్, చంద్రశేఖర్, ఈయన సతీమణి డి.నాగమణిల పేరుమీద చెరో 1.52 ఎకరాలు చొప్పున సర్వే నెం.70–3లో పొందిన 3.04 ఎకరాలకు సంబందించిన పట్టాదారు పాసుపుస్తకాన్ని రద్దు చేస్తున్నట్లు ఆర్డీఓ రామసుబ్బయ్య తన కోర్టులో బుధవారం తీర్పును వెలువరించారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే 30 రోజుల్లోగా జేసీ కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. కందికుంటకు సహకరించిన అధికారులల్లో వణుకు కందికుంట కబ్జా చేసిన స్థలాన్ని తన సమీప బంధువుల పేరుమీద పట్టాదారు పాసుపుస్తకం పొందేందుకు అప్పట్లో ఆయనకు సహకరించిన రెవెన్యూ అధికారులు, కొందరు సిబ్బందికి ఆర్డీఓ ఇచ్చిన తీర్పు గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించే సమయంలో అప్పట్లో కాసేపు రెవెన్యూ రికార్డులను ఆన్లైన్లో తారుమారు చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన కొద్ది క్షణాల్లోనే మళ్లీ యథాతథంగా మార్పు చేసిన విషయం కూడా ఇప్పటి రెవెన్యూ అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ జరిపితే ఒకరిద్దరిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నాయని రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కందికుంట పలువురు తన అనుచరుల పేరుమీద పలు తేదీల్లో రిజిష్ట్రేషన్ చేయించి చివరకు మళ్లీ తన బంధువుల పేరుమీద రిజిష్ట్రర్ చేయించుకొని పలు లింక్ డాక్యుమెంట్లు సంపాదించారు. కాగా ఆర్డీఓ తీర్పుతో కందికుంట బాధితులు త్వరలోనే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోనున్నారు. -
ముస్లింల సొమ్ము మింగేశారు!
సాక్షి, కదిరి: టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అనుచరులు కొందరికి పట్టణంలోని షాదీమహల్ కల్పతరువుగా మారింది. కమిటీ సభ్యుల పేరుతో అక్కడికి ప్రవేశించిన కందికుంట అనుచరులు ముస్లింలకు సంబంధించిన సుమారు రూ.1 కోటి దాకా ఈ ఐదేళ్లలో స్వాహా చేసినట్లు తెలుస్తోంది. కమిటీ కాలపరిమితి పూర్తయినప్పటికీ వారే కొనసాగుతూ స్వాహా పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వివరాల్లోకెళితే.. పేద ముస్లింలు ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు చేసుకోలేక పోతున్నారన్న ఉద్దేశంతో వైఎస్ సర్కారు పట్టణంలో వారి కోసం ఫంక్షన్ హాల్ నిర్మించింది. కరెంటు బిల్లుతో పాటు వాచ్మెన్ వేతనం కోసం కేవలం రూ.2 వేలు మాత్రమే వసూలు చేసి పెళ్లిళ్లు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అదికారంలోకి రాగానే స్థానిక టీడీపీ ఇన్చార్జ్ కందికుంట తన ముఖ్య అనుచరులకు షాదీమహల్ కమిటీలో చోటు కల్పించారు. దీన్ని అవకాశంగా భావించి కమిటీ సభ్యులు అక్కడే సంపాదనను మొదలెట్టారు. పెళ్ళిళ్ల వివరాలను రికార్డుల్లో నమోదు చేయకుండా కృత్రిమ డిమాండ్‌ను సృష్టిస్తూ ఒక్కో పెళ్లికి డిమాండ్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేలు దాకా వసూలు చేస్తున్నారు. ఆశ్చర్యం కల్గించే విషయమేమంటే ఈ ఏడాది ఆఖరు వరకు అక్కడ పెళ్లిళ్లు చేసుకోవడానికి తేదీలు ఖాళీగా లేవని కమిటీ సభ్యులు చెబుతున్నారంటే అక్కడ ఏ విధంగా అవినీతి జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదేళ్లలో అక్కడ సరాసరిన నెలకు సగం రోజులకు పైగానే పెళ్లిళ్లు జరిగాయని ముస్లిం పెద్దలు చెబుతున్నారు. అయితే అవేవీ రికార్డుల్లో కనబరచలేదు. నిబంధనలకు తూట్లు షాదీమహల్‌లో పెళ్లి చేయాలంటే కమిటీ సభ్యులను కలిసి షాదీమహల్ బుక్ చేసుకోవడానికి బ్యాంకులో చలానా చెల్లించాలి. ఆ చలానాకు సంబంధించిన ఒరిజినల్ కాపీ స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి ఆ కమిటీ పంపి, జిరాక్స్ కాపీని షాదీమహల్లోని కార్యాలయంలో భద్రపరచాలి. ఇలా చేయకుండా కేవలం ఏడాదికి ఆరేడు పెళ్లిళ్లు మాత్రమే జరిగినట్లు కమిటీ సభ్యులు తమ వద్దనున్న పుస్తకంలో కనబరుస్తున్నారు. అక్కడ వంట సామగ్రితో పాటు డెకరేషన్ ఇలా ప్రతి దాంట్లోనూ వారికి కమీషన్ ఇవ్వాలని ముస్లిం పెద్దలు కొందరు చెబుతున్నారు. గతంలో దాతలు ఇచ్చిన వస్తులన్నింటినీ ఆ కమిటీ మాయం చేసిందని కూడా పేర్కొంటున్నారు. క్యారియర్ బ్యాచ్ షాదీమహల్ కమిటీ సభ్యులు క్యారియర్ బ్యాచ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వీరు కందికుంటకు అనుచరులుగా ఉంటూ ఆయన తరఫున గొడవలకు దిగుతుంటారు. షాదీమహల్‌లో ఎవరు పెళ్లి జరిపించినా కమిటీ సభ్యులు ఈ బ్యాచ్‌కు విందు భోజనాలు అక్కడి నుంచే పంపుతుంటారు. అందుకే వీరిని పట్టణంలో క్యారియర బ్యాచ్‌గా పిలుస్తుంటారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌ల వద్ద బ్యాచ్ హడావుడి అంతా ఇంతా కాదు. కమిటీ సభ్యులకు అనుకూలంగా ఉన్న కొందరు అధికారులకు సైతం షాదీమహల్ నుంచే క్యారియర్ పంపుతుంటారని తెలిసింది. చర్యలు తీసుకుంటాం మైనార్టీ షాదీమహల్ కాలపరిమితి మూడేళ్ల క్రితమే ముగిసింది. అయితే గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్లు దానిపై దృష్టి సారించినట్లు లేరు. అక్కడున్న కమిటీ పెళ్లిళ్లను రికార్డుల్లో నమోదు చేయలేదని నా దృష్టికి కూడా వచ్చింది. పరిశీలించి అవినీతి సొమ్మును కక్కిస్తాం. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆ కమిటీని రద్దు చేసి షాదీమహల్‌ను రెవెన్యూ స్వాధీనంలోకి తీసుకుంటాం. తర్వాత కొత్త కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. –ఎస్.మహమ్మద్ ఖాసీం, తహసీల్దార్, కదిరి -
‘కందికుంట’ చెబితే టెండర్లు వాయిదా వేస్తారా..?
– కమిషనర్‌ను నిలదీసిన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు – మద్దతు పలికిన కొందరు టీడీపీ కౌన్సిలర్లు – రాజకీయ ఒత్తిడితో కాదంటున్న కమిషనర్ కదిరి : ‘అధికార టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ చెతితే మీరు టెండర్లు వాయిదా వేస్తారా? టెండర్ కోసం కొందరు అప్పులు చేసి డబ్బు తీసుకొచ్చారు. వారందరినీ మీరు నిరాశ పరిచారు. ఆ నాయకుడి అనుచరులకు సమయానికి డబ్బు అందుబాటు కాకపోవడంతో ఆయన మీకు ఫోన్ చేయడం, టెండర్లు రద్దు చేయడం, ఎంత వరకు కరెక్ట్? అసలు టెండర్ రద్దు చేసే అధికారం మీకెవరిచ్చారు? అంటూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ పి.భానుప్రసాద్‌ను గురువారం నిలదీశారు. ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన వీధులకు రెండు వైపులా దుకాణాలు ఏర్పాటు చేసుకునే వారి దగ్గర గేట్ వసూలు చేసుకునేందుకు 22న బహిరంగ వేలం జరగాల్సి ఉండగా, దాన్ని 27కు, 23న జరగాల్సిన కూరగాయలు, జంతువధ బహిరంగ వేలాన్ని మార్చి 6కు వాయిదా వేస్తూ కమిషనర్ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కమిషనర్‌తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ సురయాభానును వారి వారి చాంబర్లలో వేర్వేరుగా కలసి నిలదీశారు. ఎవరి ప్రయోజనాల కోసమో బహిరంగ వేలాన్ని వాయిదా వేయాల్సి వచ్చిం దని కడిగిపారేశారు. ఈ విషయంలో టీడీపీ కౌన్సిలర్లు కూడా కొందరు మద్దతు పలకడం విశేషం. టెండర్లు వాయిదా వేయడానికి తనపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని, కొన్ని టెండర్లు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతోనే వాయిదా వేయాల్సి వచ్చిందని కమిషనర్ వారితో పేర్కొన్నారు. అనంతరం తమ అభ్యంతరాల గురించి కమిషనర్‌ను వినతిపత్రం రూపంలో అందజేశారు. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు కిన్నెర కళ్యాణ్, జగన్, ఖాదర్‌బాషా, గంగాధర్, ఖలీల్, టీడీపీ కౌన్సిలర్లు శంకర్, కళ్యాణ్ తదితరులు ఉన్నారు.