హైదరాబాద్ : బండ్లగూడలోని కందికల్ గ్రామం సర్వేనంబర్ 223లో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ అధికారులు ఆదివారం కూల్చివేశారు. సుమారు 40 ఏళ్ల క్రితం ఈశ్వర్ సింగ్ అనే వ్యక్తికి అప్పటి ప్రభుత్వం 4 ఎకరాల 23 గంటల భూమిని ఇనాం కింద ఇచ్చింది. 1994లో భూమిని అప్పగించడాన్ని అప్పటి హైదరాబాద్ కలెక్టర్ రద్దు చేశారు. ఈ విషయం గురించి ప్రభుత్వానికి, ఈశ్వర్ సింగ్‌కు మధ్య కేసు కోర్టులో నడుస్తుంది.
తాజాగా ఆర్‌డీఓ నిఖిల ఆదేశాల మేరకు ఆ స్థలంలో వెలసిన కాంపౌండ్ వాల్‌ను, కల్లు షెడ్డును అధికారులు కూల్చివేశారు. స్థానిక మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో కొంత సిక్కులు దీన్ని వ్యతిరేకించటంతో..పోలీసులు 20 మందిని అరెస్టు చేసి చత్రినాక పోలీస్ స్టేషన్‌కు తరలించారు.