అక్రమ కట్టడాలను కూల్చేయండి: కేసీఆర్ | kcr order for Demolish illegal constructions | Sakshi
Sakshi News home page

అక్రమ కట్టడాలను కూల్చేయండి: కేసీఆర్

Published Mon, Jun 23 2014 3:28 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

అక్రమ కట్టడాలను కూల్చేయండి: కేసీఆర్ - Sakshi

అక్రమ కట్టడాలను కూల్చేయండి: కేసీఆర్

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పరిధిలో ఆక్రమణలు, అక్రమ కట్టడాలపై సీరియస్‌గా స్పందించాలని ఉన్నతాధికారులను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. గురుకుల్ ట్రస్ట్ భూముల్లోని అక్రమ కట్టడాలను కూల్చేయాలని, అవసరమైతే పోలీస్ ఫోర్స్‌ను వాడాలని సూచించారు. జీహెచ్ ఎంసీ, పోలీస్ ఉన్నతాధికారులతో కేసీఆర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

మరోవైపు తెలంగాణలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలపై ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సమీక్ష జరిపారు. డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సచివాలయం భద్రత, బారికేడ్ల వివాదంపై కూడా సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఈ భేటీకి డీజీపీతో పాటు, హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ కూడా హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement