కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించడానికి వెళ్లిన అధికారులకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
విశాఖపట్నం: కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించడానికి వెళ్లిన అధికారులకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. విశాఖ నగరంలోని భరత్ నగర్ పరిధిలో ఉన్న మురికి వాడలో నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రంగంలోకి దిగారు.14 అక్రమ కట్టడాలను ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు సహాయంతో అధికారులు అక్రమ కట్టడాలను కూల్చి వేస్తున్నారు.