Shahrukh Khan Luxurious Bungalow Mannat Name Plate Trending: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు సినీ ఇండస్ట్రీలో విపరీతమైన అభిమాన గళం ఉంది. వెండితెరపై ఆయన సినిమా వస్తుందంటే వేయి కళ్లతో ఎదురు చూస్తుంటారు. షారుఖ్ చేస్తున్న సినిమాలకు సంబంధించి ఎలాంటి ఫొటో వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. తాజాగా మరోసారి షారుఖ్ ఖాన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతోంది. ఇందుకు కారణం షారుఖ్ ఖాన్ తన ఇంటి నేమ్ ప్లేట్ మార్చడమే. షారుఖ్ ఖాన్‌కు ముంబైలోని బాంద్రాలో భవంతి ఉన్న విషయం తెలిసిందే. తన అభిరుచికి తగినట్లుగా ఈ ఇల్లును మలుచుకున్నాడు. ఈ ఇంటి ఖరీదు సుమారు రూ. 200 కోట్లు ఉంటుంది.
ఈ ఇంటికి ఆయన 'మన్నత్' అని పేరు పెట్టుకున్నాడు. ఇప్పటివరకూ ఈ ఇంటి నేమ్ ప్లేట్‌ను చాలా సార్లు మార్చాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి కొత్త డిజైన్‌తో మన్నత్ నేమ్ ప్లేట్‌ను మార్చాడు షారుఖ్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో దర్శనమిచ్చాయి. దీంతో ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలపై షారుఖ్ అభిమానులు తమదైన శైలీలో కామెంట్లు పెడుతున్నారు. 'ఈ డిజైన్ ఎప్పటికీ ఐకానిక్‌గా ఉంటుంది', 'మన్నత్ స్టార్‌డమ్, ప్రేమ, భావోద్వేగం, అభిరుచి, కృషి, ఇంకా అంకితభావానికి చిహ్నం', 'దేవుడి స్వర్గం. షారుఖ్ ఖాన్ ఇంటి నేమ్ ప్లేట్ కూడా ట్రెండింగ్‌లో ఉంటుంది.' అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. ఈ ఇంటిలో 2001 నుంచి షారుఖ్ ఖాన్, అతని కుటుంబం నివాసం ఉంటున్నారు.
చదవండి: హీరోగా కాదు.. అలా ఎంట్రీ ఇస్తున్న షారుఖ్ ఖాన్ కొడుకు
This design will be forever iconic.
— Samina ✨ (@SRKsSamina_) April 22, 2022
Simple, unassuming and classy, just like you @iamsrk. Not a fan of the new one to be honest. #Mannat pic.twitter.com/Nbq8Nnrah6
Comments
Please login to add a commentAdd a comment