షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం | Minor fire at Shah Rukh Khan's residence | Sakshi
Sakshi News home page

షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం

Published Fri, Nov 22 2013 9:38 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం - Sakshi

షారుఖ్ నివాసంలో అగ్నిప్రమాదం

బాలీవుడ్ నటుడు షారుఖ్‌ఖాన్ నివాసంలో గురువారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. బాంద్రాలోని షారుఖ్‌కు చెందిన మన్నత్ బిల్డింగ్ బాత్‌రూంలో ఉన్న ఎక్జాస్ట్ ఫ్యాన్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు వ్యాపించాయి. భవనంలో దట్టమైన పొగ వ్యాపించడంతో ఫైర్ అలారం మోగింది.

దీంతో భద్రతా సిబ్బంది అగ్నిమాపక దళానికి సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని భద్రతా సిబ్బంది వెల్లడించారు. భారీ నష్టం కలుగకుండా వెంటనే స్పందించిన సిబ్బందికి షారుఖ్ ట్విటర్ లో కృతజ్క్షతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement