నా సూపర్‌ ఉమెన్‌తో ఇలా, చాలా ఆనందంగా ఉంది: మహేశ్‌ | Mahesh Babu Shares Hello Magazine Photoshoot With His Wife Namrata Shirodkar | Sakshi
Sakshi News home page

నా సూపర్‌ ఉమెన్‌తో ఇలా, చాలా ఆనందంగా ఉంది: మహేశ్‌

Published Mon, Oct 4 2021 9:40 PM | Last Updated on Mon, Oct 4 2021 10:52 PM

Mahesh Babu Shares Hello Magazine Photoshoot With His Wife Namrata Shirodkar - Sakshi

టాలీవుడ్  క‌పుల్ మ‌హేశ్‌ బాబు-న‌మ్ర‌త శిరోద్కర్‌లకు సంబంధించిన ఒక మ్యాగజైన్‌ ఫొటోలు ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇవి హలో అనే మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలు అని తెలిసిందే. ఈ విషయాన్ని మహేశ్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించాడు.

‘ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుగా చాలా ఆనందంగా ఉంది. నా సూపర్‌ ఉమెన్‌తో కలిసి హలో మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫొటోలు ఇవి. తనతో కలిసి ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొన్నందుగా చాలా సంతోషంగా ఉంది’ హలో మ్యాగజైన్‌ కోసం వారు పలు ఫొటోలకు ఫొజులు ఇచ్చారు. ఇందులో ఫార్మల్‌ షూట్‌ ఈ జంట ఇచ్చిన ఫొటోలు నెటిజన్లను, సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేగాక హలో మ్యాగజైన్‌ కవర్‌ పేజీకి ఫొటోషూట్‌ ఇచ్చిన తొలి సెలబ్రెటీ కపుల్‌గా మహేశ్‌-నమ్రతల దంపతులు నిలిచారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement