టెంపాబే : ప్రవాత భారతీయులకు అండగా ఉంటూ వస్తోన్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) 2021 జూన్‌కి సంబంధించి అక్షర దీపికను విడుదల చేసింది. ఈ పుస్తకంలో ఇటీవల కాలంలో నాట్స్ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలను క్రోడీకరించారు. ముఖ్యంగా టెంపాబే నాట్స్ విభాగం ఆధ్వర్యంలో ఫ్లోరిడాలో నిర్వహించిన కాన్సులర్ సర్వీసెస్ క్యాంప్ చాలా మందికి ఉపయోగపడిందని అక్షర దీపికలో పేర్కొన్నారు. పాస్‌పోర్టు పునరుద్ధరణ, కొత్త పాస్‌పోర్ట్ దరఖాస్తు, ఐసీఐ దరఖాస్తు, పునరుద్ధరణలు, పవర్ ఆఫ్ అటార్నీ, లైఫ్ సర్టిఫికేషన్, ధ్రువీకరణ వంటి సేవలు ఈ కాన్సులర్ ద్వారా అందించారు. సుమారు 400ల మందికి పైగా భారతీయులు ఈ సేవలను ఉపయోగించుకున్నారు.
నాట్స్ ఆధ్వర్యంలో
కాన్సులర్ సర్వీసెస్‌తో పాటు విద్యార్థుల కోసం వెబినార్స్ నిర్వహించారు. న్యూజెర్సీలో బాల సుబ్రహ్మణ్యం స్వర నీరాజనం కార్యక్రమం, యోగా, తులసీ దళంలతో పాటు తెలుగు ప్రజలకు ఉపయోగపడే పలు కార్యక్రమాలను నిర్వహించినట్టు నాట్స్ ప్రతినిధులు పేర్కొన్నారు. జులై, ఆగష్టులలో సూపర్ బ్రెయిన్ వర్క్‌షాప్‌లను నిర్వహించబోతునట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment