బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ కూతురు కృష్ణ.. సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఎమ్‌ఎమ్‌ఏ పేరుతో ట్రైనింగ్ సెంటర్‌ను రన్ చేస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకముందే తన శరీర సౌష్టవంతో కుర్రకారును మతిపొగొట్టేస్తుంది. తన అందాలు ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు రేపుతోంది. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన బోల్డ్ ఫోటోషూట్‌తో తను ఏ హీరోయిన్‌కు తక్కువ కాదని నిరూపించింది. ‘ఆల్ ఐస్ ఆన్ కృష్ణ అనే పేరుతో ప్రచురించిన మ్యాగజైన్‌కు ఈ ముద్దుగుమ్మ ఏకంగా టాప్‌లెస్‌గా ఫోజులిచ్చింది. ఒంటిపై కేవలం బ్లాక్ కలర్ లెదర్ ప్యాంట్, చేతులకు గ్లోవ్స్ ధరించి బ్రేక్ ద రూల్స్ అంటూ అర్థనగ్నంగా మ్యాగజైన్‌కు ఫోజులిచ్చింది.
ఈ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను కృష్ణ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. ప్రస్తుతం అవి నెట్టింటా హల్‌చల్ చేస్తుంది. ఓ స్టార్ హీరో కూతురు ఇలా అర్ధనగ్నంగా మ్యాగజైన్ కోసం పోజులివ్వడం ఇప్పుడు బీటౌన్‌లో హాట్ టాపిగా మారింది. దిశాపటాని, అతియా శెట్టి వంటి స్టార్లందరూ కృష్ణ ఫోజుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ మైగాడ్, హాట్ బ్యూటీ అంటూ హార్ట్ ఎమోజీలను జత చేశారు. అదే విధంగా ‘బాలీవుడ్‌లో కృష్ణ మంటలు రేపగలదు. ఆమె ఫుల్ ఫైర్ మీద ఉంది’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఇబాన్ హయమ్స్‌తో ప్రేమలో మునిగిన కృష్ణ గతేడాది చివర్లో తాము విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment