
అభిమానుల సంఘం ఒకటి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
చెన్నై: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన దేశవాసులు సోషల్ మీడియా వేదికగా తమలోని కళను బయటపెడుతుండగా.. ఇక నటీనటులు కూడా అదే తోవలో నడుస్తున్నారు. తాజాగా దక్షిణాది టాప్ హీరోయిన్లలో ఒకరైన త్రిష కృష్ణన్ టిక్‌టాక్‌లో మెంబర్ అయ్యారు. ఫన్నీ వీడియోలు పోస్టు చేస్తూ సరదాగా గడుపుతున్నారు. ఫేమస్ ర్యాప్ సాంగ్ ‘సేవేజ్’కు త్రిష టిక్‌టాక్ చేశారు. ఆమె డ్యాన్స్‌కు ఫిదా అయిన అభిమానుల సంఘం ఒకటి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. కాగా, 1999లో మిస్ మద్రాస్‌గా ఎంపికైన త్రిష తెలుగు, తమిళ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా నటిగా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష కెరీర్‌కు ఇప్పటి వరకూ డోకా లేదు. మధ్యలో అపజయాలతో వెనుకబడినా, 96 చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది.
(చదవండి: వాళ్ల మాట వినను!)
(ఇద్దరు హీరోలతో వీడియో కాల్ మాట్లాడిన త్రిష)