పెళ్లి వార్తలపై త్రిష బోల్డ్ ట్వీట్ | Trisha Krishnan Reacts To Wedding Rumours - Sakshi
Sakshi News home page

Trisha Krishnan: పెళ్లిపై త్రిష రియాక్షన్‌.. వారిద్దరితో ఆమె రొమాన్స్‌..అది నచ్చకనే ఈ రూమర్స్‌

Published Thu, Sep 21 2023 6:44 PM | Last Updated on Thu, Sep 21 2023 7:30 PM

Trisha Krishnan Reaction Her Marriage Rumours - Sakshi

తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయికగా ఇప్పటికీ వరుస సినిమాలతో సౌత్‌ ఇండియాలో సందడి చేస్తున్న నటి త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ తరగని అందంతో యువతను మంత్రముగ్ధులను చేస్తోంది. 20 ఏళ్లకు పైగా చిత్రసీమలో తన నట ప్రస్థానం దిగ్విజయంగా కొనసాగుతోంది. తాజాగా త్రిష మలయాళ నిర్మాతను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నటి త్రిష స్పందించింది. చేతినిండా సౌత్‌ ఇండియాలోని అగ్ర హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్‌లతో ఆమె దూసుకుపోతున్న సమయంలో తనపై పెళ్లి పుకారు దావానలంలా వ్యాపిస్తున్న వేళ, దానికి ముగింపు పలుకుతూ త్రిష చేసిన బోల్డ్ ట్వీట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

(ఇదీ చదవండి: డ్రగ్స్‌ కేసులో నవదీప్‌కు ఊహించని షాకిచ్చిన పోలీసులు)

 ప్రియమైన 'మీరు  మీతో పాటు ఉన్న మీ బృందం ఎవరో మీకు తెలుసు. శాంతంగా ఉండండి. ఇంతటితో ఈ పుకార్లు ఆపండి. చీర్స్! అంటూ తనదైన స్టైల్లో త్రిష తన ఎక్స్‌ (ట్విటర్‌) ఖాతాలో పోస్ట్‌ చేసింది. గత కొన్ని రోజులుగా హీరో విజయ్‌కి చెందిన లియో సినిమా ప్రమోషన్‌ కీప్ కామ్‌గా ప్రమోట్ అవుతుండటంతో, నటి త్రిష కూడా అదే పదాలను ఉపయోగించి ఈ ట్వీట్‌ చేయడం మరింత చర్చనీయాంశమైంది. ఇది విజయ్, అతని బృందానికి వార్నింగ్? ఇస్తున్నావ్‌ కదా అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. 

(ఇదీ చదవండి: పెళ్లి ముందు వరకు నాకు ఆ విషయం తెలియదు: అనసూయ)

వరుసగా విజయ్, అజిత్ సినిమాల్లో త్రిష రొమాన్స్‌ చేయనుంది. ఇది ఎవరికో నచ్చకనే ఆమెపై ఇలాంటి కుట్రలు చేస్తూ.. పుకార్లు పుట్టిస్తున్నారని ప్రచారం జరగుతుంది. గత కొన్ని నెలలుగా త్రిషపై అనేక రూమర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న తరుణంలో ఓపిక పట్టిన నటి త్రిష ఇప్పుడు ఎవరినో ఒకరి టీమ్‌ను తను గుర్తించిన తర్వాతే ఇలా రియాక్ట్‌ అయినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement