
చెన్నై చంద్రం త్రిషా పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే రోటీన్ భిన్నంగా చార్మీ ఓ డిఫరెంట్ మెసేజ్‌తో త్రిషకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ‘బేబీ నిన్ను ఎప్పుటికీ ప్రేమిస్తుంటాను. నువ్వు నా ప్రతిపాదన ఎప్పుడు అంగీకరిస్తావా అని ఎదురుచూస్తున్నా. పెళ్లి చేసేసుకుందాం! ఇప్పుడు ఇది చట్టబద్ధం కూడా’ అంటూ ట్వీట్ చేశారు. గతంలోనూ చార్మి ఇదే రకమైన ట్వీట్ చేశారు. అప్పుడు పెళ్లికి నేను సిద్ధమే అంటూ త్రిష రిప్లై కూడా ఇచ్చారు.
దాదాపు ఒకే సమయంలో స్టార్ హీరోయిన్స్‌గా వెలుగొందిన ఈ ఇద్దరు భామలు మంచి స్నేహితులు. త్రిష ఇప్పటికీ హీరోయిన్‌గా కొనసాగుతుండగా, చార్మి మాత్రం యాక్టింగ్‌కు దాదాపు గుడ్ బై చెప్పేసి సినీ నిర్మాణం మీద దృష్టి పెట్టారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి పీసీ కనెక్ట్ సంస్థలో సినిమాలు నిర్మిస్తోన్నారు.
Baby I love u today n forever 😘
— Charmme Kaur (@Charmmeofficial) 4 May 2019
Am on my knees waiting for u to accept my proposal 💍 let’s get married😛😛 ( now toh it’s legally allowed also 😛 ) #happybirthday @trishtrashers 😘😘😘😘 pic.twitter.com/e2F3Zn3Dp3
Comments
Please login to add a commentAdd a comment