నేను మనుషులను పట్టించుకోను: త్రిష | Trisha Krishnan Comments On Surrounding Persons | Sakshi
Sakshi News home page

నేను మనుషులను పట్టించుకోను: త్రిష

Published Mon, Oct 28 2024 10:28 AM | Last Updated on Mon, Oct 28 2024 10:46 AM

Trisha Krishnan Comments On Surrounding Persons

అందాల భామ నటి త్రిష. నాలుగు పదుల పరువాల సంచలన నటి ఇప్పటికీ అవివాహితనే అన్నది తెలిసిందే. కథానాయకిగా సెంచరీలు కొట్టినా పెళ్లికి మాత్రం దూరంగా ఉంటూ సోలో లైఫే సో బెటర్‌ అనేలా నడుపుతున్నారు. అయితే చాలా కాలం క్రితమే చైన్నె బ్యూటీ పెళ్లికి సిద్ధమయ్యారు. ఒక నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే అది కారణాలు ఏమైనా పెళ్లి పీటలు ఎక్కలేదు అప్పటినుంచి త్రిష నటనపైనే దృష్టి సారిస్తున్నారు. 

అంతేకాకుండా జీవితంలో పెళ్లి అనేది ముఖ్యమే అంటూ అందుకు సమయం వచ్చినప్పుడు వివాహం చేసుకుంటానని చెబుతూ వస్తున్నారు. అదే విధంగా ఈ అమ్మాయి గురించి ప్రేమ వదంతులు చాలానే దొర్లాయి. కాగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష తాజాగా అసలు మనుషులతో పనిఏంటి అనే విధంగా తన ఎక్స్‌ మీడియాలో ఓ టీట్‌ చేశారు. అందులో తాను మనుషులను దూరంగా పెడతానని, శునకాలను ప్రేమిస్తానని అయితే నా శునకాలు మాత్రం ఇతర శునకాలను పక్కన పెడుతూ మనుషులను ప్రేమిస్తాయన్నారు. కాబట్టి మనమంతా కలిసి ప్రేమైక సమాజాన్ని స్థాపిద్దాం అని త్రిష పేర్కొన్నారు. ఈమె ట్వీట్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. 

అదేవిధంగా త్రిష గురించి మరో విషయం కూడా సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. ఈమె తన అభిమాన నటుడు విజయ్‌ అని చాలాసార్లు పేర్కొన్నారు. కాగా విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. దీంతో త్రిష ఆయన పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. కాగా నటుడు విజయ్‌ ఆదివారం ఆయన తొలిసారిగా మహానాడు కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. దీంతో ఈ కార్యక్రమంలో నటి త్రిష పాల్గొంటారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆమె మహానాడులో పాల్గొనక పోవడం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement