స్టార్‌ హీరో మూవీ.. త్రిష స్థానంలో సమంత? | Is Samantha Replacing Trisha in Salman Khan Movie? | Sakshi

Samantha: సామ్‌కు బాలీవుడ్‌లో ఆఫర్‌.. ఊ అంటుందా? ఉఊ అంటుందా?

Jan 6 2024 9:46 AM | Updated on Jan 6 2024 10:31 AM

Is Samantha Replacing Trisha in Salman Khan Movie? - Sakshi

పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా ఉఊ అంటావా అనే ఐటమ్‌ సాంగ్‌లో సమంత నటన బాలీవుడ్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో సల్మాన్‌ఖాన్‌కు జంటగా ఈ బ్యూటీని నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఆ మధ్య కూడా సల్మాన్‌ సినిమాలో సమంత నటించనుందంటూ వార్తలు రాగా అవి ఉట్టి పుకార్లేనని

హీరోయిన్‌ సమంత మళ్లీ రిఫ్రెష్‌ అవుతున్నారు. 2010లో ఏ మాయ చేసావె సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సామ్‌. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో తనకు బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. అలా జూనియర్‌ ఎన్టీఆర్‌తో బృందావనం, మహేశ్‌ బాబు సరసన దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, రాజమౌళి దర్శకత్వంలో ఈగ వంటి పలు సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలిచి సామ్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాయి.

లేడీ ఓరియంటెడ్‌ సినిమాల్లోనూ..
అదేవిధంగా తమిళంలోనూ విజయ్‌, సూర్య, ధనుష్‌, విజయ్‌సేతుపతి వంటి స్టార్‌ హీరోల సరసన నటించిన క్రేజీ హీరోయిన్‌గా మారారు. వీటితో పాటు కొన్ని లేడీ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలలోనూ నటించి సక్సెస్‌ అయ్యారు. ఇలా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న సమంత జీవితంలో ఒక్క కుదుపు.. అదే మయోసైటిస్‌.. ఈ అరుదైన వ్యాధి వల్ల సమంత కొంత మానసిక వేదనకు గురయ్యారు. వైద్య చికిత్స కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి!

ది బుల్‌ సినిమాలో సామ్‌?
అయితే ఆమె ఇప్పటికీ అభిమానులకు మాత్రం దూరం కాలేదు. సమంత చివరిగా నటించిన చిత్రం ఖుషీ. అదేవిధంగా హిందీలోనూ ది ఫ్యామిలీ మెన్‌–2, సిటాడాల్‌ అనే వెబ్‌ సిరీస్‌లలో నటించారు. ప్రస్తుతం చైన్నె స్టోరీస్‌ అనే ఆంగ్ల చిత్రంలో నటిస్తున్నారు. తాజాగా ఈమెకు బాలీవుడ్‌ నుంచి మరోసారి పిలుపు వచ్చినట్లు సమాచారం. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించనున్నారు. దీనికి ది బుల్‌ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇందులో మొదట త్రిషను హీరోయిన్‌గా తీసుకోవాలని భావించినట్లు ప్రచారం జరిగింది.

ఈసారైనా నిజమవుతుందా?
కొన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ పాత్రలో సమంతను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పుష్ప చిత్రంలోని ఊ అంటావా మావా ఉఊ అంటావా అనే ఐటమ్‌ సాంగ్‌లో సమంత నటన బాలీవుడ్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. దీంతో సల్మాన్‌ఖాన్‌కు జంటగా ఈ బ్యూటీని నటింపచేయడానికి చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఆ మధ్య కూడా సల్మాన్‌ సినిమాలో సమంత నటించనుందంటూ వార్తలు రాగా అవి ఉట్టి పుకార్లేనని కొట్టిపారేసిందీ బ్యూటీ. మరి ఈసారి జరుగుతున్న ప్రచారం ఎంతవరకు నిజమో చూడాలి!

చదవండి: Yatra 2 Teaser: ఆకట్టుకుంటున్న 'యాత్ర 2' టీజర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement