
తమిళసినిమా: సినిమాను, వదంతులను వేరు చేయలేం. ఏదైనా వేదికపై ఒక నటి, నటుడు కాస్త చనువుగా మాట్లాడుతూ కనిపించారంటే చాలు ఆ ఇద్దరి గురించి వదంతుల పర్వం మొదలవుతుంది. ప్రేమలో మునిగితేలుతున్నారు, పెళ్లి చేసుకోబోతున్నారు లాంటి గాసిప్స్ వైరల్ అవుతాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదన్న నానుడిని పక్కన పెడితే ఇలాంటి వదంతులను కొందరు ఎంజాయ్ చేస్తారు. మరి కొందరు వేదన చెందుతారు. ఇంకొందరు అస్సలు పట్టించుకోరు. అలాంటి వదంతులు నటి రకుల్ వైపు దూసుకొస్తున్నాయి. మరి అమ్మడు ఈ మూడింటిలో ఏ కోవకు చెందిందో చూద్దాం. ఇంతకు ముందు వరకూ ఈ అమ్మడిపై పెద్దగా వదంతులు ప్రచారం కాలేదు. తాజాగా రకుల్ చుట్టూ అలాంటివి ముసురు కుంటున్నాయి. టాలీవుడ్ యువ నటుడు రానాతో చెట్టాపట్టాల్ అంటూ గుసగుసలు మొదలయ్యాయి. రానాపై ఇలాంటి వదంతులు రావడం ఇదేం కొత్త కాదు. ఆ మధ్య నటి త్రిషతో కలుపుతూ చాలా హాట్‌గానే ప్రచారం జరిగింది.
అయితే అదంతా అసత్య ప్రచారం అంటూ ఇద్దరూ కొట్టిపారేశారు. మరో విషయం ఏమిటంటే తన గురించి ప్రచారం అయ్యే గాసిప్స్ గురించి రానానే సరదాగా చెబుతుంటారు.ఇలాంటి వాటిని ఆయన చాలా స్పోర్టివ్‌గా తీసుకుంటారు కూడా. కారణం అవన్నీ వదంతులు కావడమేనంటారాయన. ప్రేక్షకులు మాత్రం ఇలాంటివన్నీ ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది తన గురించి వైరల్ అవుతున్న వదంతుల గురించి నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఏమంటుందో చూద్దాం. రానా తాను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. అలా తమ గ్రూప్‌లో 20 మంది ఉన్నామని చెప్పింది. అందులో పెళ్లి కానివారు చాలా తక్కువ మంది ఉన్నామని, అలాంటి వారందరం సన్నిహితంగా ఉంటామని పేర్కొంది. రానాతో తనను కలుపుతూ జరుగుతున్న ప్రచారం గురించి తామిద్దం నవ్వుకుంటామని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళం, తెలుగు, హింది భాషలో నటిస్తూ బిజీగా ఉంది. తమిళంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్యతో రొమాన్స్ చేస్తున్న రకుల్‌ప్రీత్‌సింగ్ త్వరలో ఆయన తమ్ముడు కార్తీతో «ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం తరువాత రెండోసారి జత కట్టడానికి రెడీ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment