ఏ విషయానికైనా ప్రతిభ మాత్రమే ఉంటే చాలదు, కాస్తంత అదృష్టం కూడా ఉండాలి అని పెద్దలు అంటుంటారు. త్రిష విషయంలో ఇప్పుడదే జరుగుతోంది. 20 ఏళ్ల క్రితం జోడీ అనే చిత్రంలో నటి సిమ్రాన్‌కు స్నేహితురాలిగా ఒకటి రెండు సన్నివేశాల్లో కనిపించిన త్రిష అగ్ర కథానాయకిగా రాణిస్తుందని బహుశా ఆమె కూడా అనుకుని ఉండదు. అలాంటిది సామి, గిల్లి వంటి చిత్రాలు త్రిషను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టాయి. అలా తమిళంతోపాటు తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో కథానాయికగా నటించింది.
గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన మణిరత్నం
అయితే ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వచ్చి బెడిసి కొట్టిన ఘటన త్రిష కెరీర్ పై బలంగానే పడిందని చెప్పక తప్పదు. ఇప్పటివరకు ఈమె అవివాహిత గానే ఉండడం గమనార్హం. ఇక లేడీ ఓరియంటెడ్ కథా చిత్రాలు త్రిషకు అచ్చి రాలేదు. అలాంటిది త్రిషకు దర్శకుడు మణిరత్నం గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో అవకాశం కల్పించారు. అందులో యువరాణి కుందవైగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది. అలా పొన్నియిన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలు హిట్ కావడంతో త్రిష పేరు మరోసారి మారుమోగింది.
అన్నీ మంచి శకునములే..
ఆ తర్వాత అన్నీ మంచి శకునములే అన్నట్టుగా వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వరిస్తున్నాయి. ఇటీవల విజయ్ సరసన నటించిన లియో చిత్రం కూడా అదిరిపోయే వసూళ్లు రాబట్టింది. అజిత్‌కు జంటగా విడాముయర్చి చిత్రంలో నటిస్తోంది. తదుపరి కమల్ హాసన్ సరసన నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. మణిరత్నం ఈమెకు మరోసారి ఛాన్స్ ఇచ్చారు.. కమల్ హాసన్ 224వ చిత్రంలో ఈమెనే ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. అలా మరో మల్టీ స్టారర్ చిత్రంలో నటించే మెగా అదృష్టం ఈ చైన్నె సుందరిని వరించింది. ఇలా ఇప్పుడు త్రిష టైం నడుస్తోందన్నమాట.
Comments
Please login to add a commentAdd a comment