సౌత్ స్టార్ త్రిష కృష్ణన్ తన అందం, అభినయంతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్నారు. దాదాపు అన్ని భాషల అగ్రహీరోల సరసన నటించి ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక త్రిషకు సినిమాల పరంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ అమితమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవలే టిక్‌టాక్‌లో కూడా మెంబర్ అయ్యారు. ర్యాప్ సాంగ్ ‘సేవేజ్’కు త్రిష టిక్‌టాక్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా త్రిష మరో పాటకు పెదాలు కలిపి ఆడిపాడారు. అమెరికన్ సింగర్ కేష పాడిన ట్రెండింగ్ కన్నిబాల్ పాటకు తనదైన శైలిలో స్టెప్పులు వేశారు ఈ వీడియోలో త్రిష తన లుక్స్‌తో పిచ్చి క్యూట్‌గా కనిపిస్తున్నారు. (‘నీలో ఏమాత్రం మార్పు లేదు’)
ఈ పాటకు త్రిష డ్యాన్స్ చూసిన ఆమె అభిమానులు రెడ్ అండ్ బ్లాక్ కలర్ షర్టులో అదిరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో విక్రమ్, ఐశ్వర్య రాయ్, జయం రవి, కార్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం కిట్టి పరమపాదమ్ విలయట్టు, గార్జనై, రాంగి, షుగర్, రామ్, పొన్నియిన్ సెల్వన్ వంటి చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. కాగా త్రిష చివరగా 2019లో రజనీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన హిట్ మూవీ 'పేటా'లో కనిపిచారు. (టిక్‌టాక్‌లో త్రిష.. ‘సేవేజ్’ పాటకు స్టెప్పులు)
Comments
Please login to add a commentAdd a comment