పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో యువరాణి కుందవైగా నటి త్రిష సత్తాచాటారు. అయితే ఆ తరువాత నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం రాంగీ చిత్రం ఆమెను నిరాశపరిచింది. కాగా తాజాగా త్రిష నటించిన ది రోడ్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఏఏఏ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అరుణ్ వశీకరన్ కథ, దర్శకత్వం బాధితులను నిర్వహించారు.
(ఇదీ చదవండి: లిప్‌లాక్ సీన్‌కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!)
నటుడు సంతోష్ ప్రతాప్ షబీర్, నటి మియా జార్జ్, షబీర్ వేల రామమూర్తి ఎం ఎస్ భాస్కర్, వివేక్ ప్రసన్న తదితరులు ముఖ్యపాత్ర పోషించిన ఈ చిత్రానికి శ్యామ్ సి ఎస్ సంగీతాన్ని, వెంకటేష్ జీకే చాయాగ్రహణం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది గత 20 ఏళ్ల క్రితం మదురైలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన చిత్రమని చెప్పారు. ఇందులో నటి త్రిష ఏడేళ్ల పాపకు తల్లిగా, జర్నలిస్టుగా నటించారని చెప్పారు. తనకు అన్యాయం చేసిన వారిపై త్రిష ఎలా పగ తీర్చుకున్నార నేదే ఈ చిత్రీ కథ అని చెప్పారు.
కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ది రోడ్ చిత్రాన్ని అక్టోబర్ 6వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక పూర్వకంగా వెల్లడించారు. కాగా అదే విధంగా అక్టోబర్ 19వ తేదీన విజయ్, త్రిష జంటగా నటించిన చిత్రం తెరపైకి రానున్నది. మొత్తం మీద త్రిష నటించిన చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఒకే నెలలో తెరపైకి రానున్నాయన్న మాట. కాగా త్రిష ప్రస్తుతం విజయ్‌తో నటిస్తున్న లియో చిత్రాన్ని పూర్తి చేసి తెలుగు, మలయాళం భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment