15 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ అడుగుపెడుతున్న త్రిష | Trisha Krishnan Re Entry In Bollywood After 15 Years, Rumours Goes Viral | Sakshi
Sakshi News home page

15 ఏళ్ల తర్వాత మళ్లీ అక్కడ అడుగుపెడుతున్న త్రిష

May 7 2024 6:42 AM | Updated on May 7 2024 3:02 PM

Trisha Krishnan Re Entry In Bollywood After 15 Years

సౌత్‌ ఇండియాలో ప్రస్తుతం అగ్ర కథానాయకిగా రాణిస్తున్న త్రిష. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ ఏక కాలంలో పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. అయితే, తాజాగా మరోసారి బాలీవుడ్‌లో రీఎంట్రీకి సిద్ధ అయినట్లు తెలుస్తోంది. త్రిష 2010లో కట్టా మీఠా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్‌కు జంటగా త్రిష నటించింది. అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో త్రిష కూడా ఇక అటు వైపు దృష్టి సారించలేదు. 

అలాంటిది సుమారు 15 ఏళ్ల తరువాత మరోసారి ఈ భామకు బాలీవుడ్‌ అవకాశం తలుపు తట్టినట్లు తెలుస్తోంది. ఇందులో నటుడు సల్మాన్‌ఖాన్‌ సరసన న టించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. కాగా 40 ఏళ్లను పూర్తి చేసుకుని 41వ సంతంలోకి అడుగు పెట్టిన త్రిష ఇప్పటికీ అవివాహితే. కాగా ఇటీవల ఈమె ఆధ్యాత్మికంపై దృష్టి మళ్లించినట్లు స్పష్టం అవుతోంది. ఇందుకు కారణం గత ఏడాది త్రిష తన పుట్టిన రోజును షిరిడీలో జరుపుకున్నా రు. 

కాగా ఈ ఏడాది నటుడు విజయ్‌ చెన్నైలో నిర్మించిన సాయిబాబా మందిరంలో చేసుకున్నారు. ఆ ఫొటోలను ఆమె సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. కాగా  త్రిష సాయిబాబా భక్తురాలిగా మారినట్లు తెలుస్తోంది. ఇకపోతే తనకు పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఎక్స్‌ మీడియా ద్వారా ఆమె ధన్యవాదాలు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement