యజమానికి రూ. 5 లక్షలు మిగిల్చిన అంబూ | Dog returns home, saves couple 5L reward | Sakshi
Sakshi News home page

యజమానికి రూ. 5 లక్షలు మిగిల్చిన అంబూ

Published Tue, May 20 2014 4:04 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

యజమానికి రూ. 5 లక్షలు మిగిల్చిన అంబూ - Sakshi

యజమానికి రూ. 5 లక్షలు మిగిల్చిన అంబూ

చెన్నై సాలిగ్రామానికి చెందిన శరవణన్, సంగీత దంపతులు మోంగ్రెయిల్ జాతికి చెందిన 'అంబూ' అనే కుక్కును పెంచుకున్నారు. అయితే ఆ దంపతులు ఇటీవల కెనడా పర్యటనకు వెళ్లారు. దాంతో అంబూ అలిగిందో ఏమో శుక్రవారం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఆ విషయాన్ని ఇంటి పనివారు శరవణన్ దంపతులకు సమాచారం అందించారు. అంతే వారు ఆగమేఘాల మీద ఇండియా వచ్చారు. అంబూను వెతికే క్రమంలో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేసి... తమ వంతు ప్రయత్నంగా నగరం అంతా గాలించారు. అయిన ఫలితం లేకపోయింది. అల్లారుముద్దగా పెంచుకున్న అంబూ కనిపించకపోవడంతో ఆ దంపతులు కన్నీరు మున్నీరు అయ్యారు. ఇక లాభం లేదని ఓ నిర్ణయానికి ఆ దంపతులు వచ్చేశారు.

అంబూ ఆచూకీ తెలిపిన లేక తీసుకువచ్చి తమకు అప్పగించిన అక్షరాల రూ. 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు. అంబూ ఫోటోతో పాటు ఫోన్ నెంబర్లు 9940393023, 08105302635 వివరాల పోస్టర్‌ను శరవణన్ దంపతులు ఫేస్ బుక్ లో పెట్టారు. అలాగే అంబూ పోస్టర్‌ను బ్లూక్రాస్ సొసైటీ ఫేస్‌బుక్ పేజీలో సైతం వుంచారు. అంబూ ఆచూకీ ఎవరైన తెలపకపోతారా అంటూ వెయ్యి కళ్లతో ఆ దంపతులు ఎదురు చూడసాగారు. అంబూ ఎలాగైన తమకు దక్కితే చాలని భావించారు. అయితే తన యజమానులు తన కోసం బెంగపడ్డారనో లేక తన ఆచూకీ తెలిస్తే రూ. 5 లక్షలు ఇస్తానని ప్రకటించారని తెలిసిందో ఏమో అంబూ మంగళవారం ఉదయం శరవణన్ ఇంటి ముందుకు వచ్చి నిలబడింది.

ఆ విషయాన్ని గమనించిన శరవణన్ దంపతులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంటి ముందు ఉన్న అంబూను అమాంతంగా ఇంట్లోకి ఎత్తుకుని తీసుకువచ్చారు. అనంతరం ఆ దంపతులు అంబూపై ముద్దుల వర్షం కురిపించారు. అంబూ వచ్చిన ఆనందాన్ని శరవణన్ దంపతులు అందరితో పంచుకున్నారు. అంబూ కోసం ఇంత ప్రచారం చేసిన, భారీగా నగదును నజరానాగా ప్రకటించిన అంబూ ఎవరికి చిక్కకుండా... నేరుగా ఇంటికి వచ్చింది. దాంతో శరవణన్ దంపతులకు అంబూ రూ. 5 లక్షలు మిగిల్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement